Friday, February 21, 2025
Homeనేషనల్Seeshmahal: ఆప్ కొంప ముంచిన 'శీష్ మహల్' ఇక మ్యూజియమే

Seeshmahal: ఆప్ కొంప ముంచిన ‘శీష్ మహల్’ ఇక మ్యూజియమే

బాత్రూంలో ఏసీలు పెట్టుకున్న కేజ్రీవాల్

శీష్ మహల్ ..ఆమ్ ఆద్మీ పార్టీ కొంప ముంచింది సీఎం అధికారిక నివాసమైన ఈ శీష్ మహలే. భారీ ఇంద్ర భవనం, అత్యాధునిక నివాసంగా, ఆఖరుకి టాయ్లెట్ కమోడ్ కూడా లక్షల రూపాయల విలాసవంతమైనవిగా నిర్మించుకున్న ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకంగా తన అవసరాలకు, అభిరుచికి తగ్గట్టుగా రూపు రేఖలను మార్పించుకున్న సీఎం అధికారిక నివాసం ఇప్పుడిక మ్యూజియంగా మారనుంది.

- Advertisement -

ఎన్నికల్లో ప్రధాన అంశంగా

2015-2024 మధ్యకాలంలో కేజ్రీవాల్ ఇక్కడినుంచే ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించారు. 40,000 స్క్వయర్ యార్డ్స్ ఉన్న ఈ భారీ భవంతిని హై పొలిటికల్ డ్రామా మధ్య తప్పనిసరి పరిస్థితుల్లో కేజ్రీవాల్ సీఎంగా తప్పుకోగానే ఖాళీ చేయాల్సివచ్చింది. ఇక అప్పటి నుంచి శీష్ మహల్ రిపేరీ, మెయిన్టెనెన్స్ పై బీజేపీ తెగ ప్రచారం మొదలుపెట్టి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో శీష్ మహల్ అంశాన్నే ప్రధాన ప్రచార అస్త్రంగా ప్రయోగించింది. కాగా తాము అధికారంలోకి రాగానే శీష్ మహల్ ను మ్యూజియం చేస్తామంటూ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన బీజేపీ ఇప్పుడు దాన్ని నిలబెట్టుకునే పనిలో పడింది. శీష్ మహల్ కుంభకోణంపై పూర్తిస్థాయి దర్యాప్తుకు సైతం ఆదేశించగా సీవీసీ ఆధ్వర్యంలో వారం రోజులుగా దర్యాప్తు పనులు జోరుగా సాగుతున్నాయి.

జాకూజి కూడా ఉన్న బంగ్లా!

70 లక్షల టీవీ, 20 లక్షల రూపాయల విలువైన స్పాతో పాటు అత్యంత విలాసవంతమైన సదుపాయాలను కేజ్రీవాల్ ఏరి కోరి ఈ భవనంలో ఏర్పాటు చేసుకున్నట్టు కాగ్ రిపోర్టులో వెల్లడైంది. జాకూజి అంటే హాట్ టబ్ బాత్ కూడా ఇందులో ఉండటం మరో హైలైట్. స్పా, సౌనాతో పాటు జాకూజి ఉండటం సెన్సేషనల్ గా మారింది. 8 బెడ్రూములు, రెండు కిచెన్లు, 12 బాత్రూములు, జిమ్, 3 మీటింగ్ రూములు ఉండగా పనివాళ్ల కోసం ప్రత్యేకంగా మరో 7 ఇళ్లను 20 కోట్లతో నిర్మించేలా కేజ్రీవాల్ ప్రత్యేక చర్యలు చేపట్టడం సంచలనం సృష్టించింది.  జిమ్, కిచెన్, ఆఖరుకి బాత్రూములో కూడా ఏసీలు ఉండేలా ఏకంగా శీష్ మహల్ లో 50 ఇండోర్ ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి.  8 ఎకరాల్లో విస్తరించిన ఈ బంగ్లా రిపేరీకి 33 కోట్లు వెచ్చించినట్టు ఆప్ సర్కారు అప్పట్లో ప్రకటించినా నిజానికి అయిన ఖర్చు 80 కోట్ల పైమాటే అన్నది బీజేపీ వాదన.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News