IPS Officer Puran Kumar Shoots Himself at His House: హర్యానా రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ మంగళవారం తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చండీగఢ్‌లోని సెక్టార్ 11లోని ఆయన నివాసంలో జరిగింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) అనే ఉన్నత స్థానంలో ఉన్న పూరణ్ కుమార్, 2001 బ్యాచ్‌కు చెందిన అధికారి. సెప్టెంబర్ 29న రోహ్‌తక్, సునారియాలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (PTC)లో ఆయనకు పోస్టింగ్ వచ్చింది. ఇంత ఉన్నత స్థానంలో ఉన్న అధికారి ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు మాత్రం వెంటనే తెలియరాలేదు.
ALSO READ: Child Assault: మియాపూర్ లో దారుణం: ప్రియుడితో కలిసి ఐదేళ్ల చిన్నారిని చితకబాదిన తల్లి
చండీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కన్వర్‌దీప్ కౌర్ విలేకరులతో మాట్లాడుతూ, “మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో సెక్టార్ 11 పోలీస్ స్టేషన్‌కు మాకు సమాచారం అందింది. సెక్టార్ 11 SHO, వారి బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఇది ఆత్మహత్యగా నివేదించబడింది.. మృతదేహాన్ని ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్‌గా గుర్తించారు” అని తెలిపారు.
ALSO READ: Unnatural Sex Dispute: కేరళలో సగం కాలిపోయిన మృతదేహం లభ్యం.. ‘అసహజ శృంగారమే’ కారణం?
ఘటనా స్థలంలో ఆత్మహత్య లేఖ ఏమైనా లభించిందా అని విలేకరులు ప్రశ్నించగా, “సీఎఫ్‌ఎస్‌ఎల్ (సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ) బృందం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది, దర్యాప్తు కొనసాగుతోంది” అని ఆమె బదులిచ్చారు.
కాగా, పూరణ్ కుమార్ భార్య అమన్ పి. కుమార్ ఐఏఎస్ అధికారిణి. ప్రస్తుతం ఆమె అధికారిక పర్యటన నిమిత్తం జపాన్‌లో ఉన్నారు. ఆమె రేపు (బుధవారం) సాయంత్రం భారతదేశానికి తిరిగి రానున్నారు. ఈ ఘటన హర్యానా, చండీగఢ్ పోలీసు వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.


