Saturday, November 15, 2025
Homeనేషనల్Kochi: ప్రధాని మోదీపై శశిథరూర్ ప్రశంసలు.. పార్టీ వీడబోతున్నారా..!

Kochi: ప్రధాని మోదీపై శశిథరూర్ ప్రశంసలు.. పార్టీ వీడబోతున్నారా..!

Congress: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురం నుండి నాలుగు సార్లు ఎంపీగా గెలిచినా థరూర్ అమెరికా పర్యటనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. అలాగే కేరళలోనే లెఫ్ట్ ప్రభుత్వ పాలసీలను పొగిడాడు. పార్టీలు కేవలం మెరుగైన దేశాన్ని నిర్మించే సాధనాలు మాత్రమే అని, ఏ విషయంలో అయినా దేశమే ముందుగుగా ఉండాలని అన్నారు. ఇటీవల కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ భద్రత దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ఒకదానితో మరొకటి సహకరించుకోవాలని ఆయన చెప్పారు.

- Advertisement -

శశిథరూర్ కి కాంగ్రెస్ తో విభేధాలు ఉన్నాయన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై శశి థరూర్ స్పందిస్తూ గత 16 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. పార్టీతో కొన్ని విభేదాలు ఉన్నాయని కానీ వాటిని అంతర్గతంగా చర్చించుకుంటానని చెప్పారు. తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను జాతీయ భద్రత, జాతీయ ప్రయోజనాలను కూడా నమ్ముతానని థరూర్ చెప్పారు.

Readmore: https://teluguprabha.net/national-news/kharge-criticises-modi-manipur-vadra-case/

ఆపరేషన్ సింధూర్, దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో ప్రధాన మంత్రి మోదీకి మద్దతు ఇవ్వడంపై తాను ఎదుర్కొన్న విమర్శలను ప్రస్తావించారు. మన సాయుధ దళాలకు, ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ తాను తీసుకున్న వైఖరిపై చాలామంది తనను విమర్శించారని అన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా పార్టీ లక్ష్యం సొంత మార్గంలో మెరుగైన భారతదేశాన్ని సృష్టించడమేనని అన్నారు. ఏ ప్రజాస్వామ్యంలో అయినా రాజకీయాల్లో పోటీ అనివార్యంగా ఉంటుందని, కానీ క్లిష్టమైన సమయాల్లో కలిసి పనిచేయడానికి అది అడ్డురాకూడదని ఆయన అన్నారు.

Readmore: https://teluguprabha.net/national-news/ed-notice-google-meta-betting-apps/

దేశ సేవ చేయటంలో ఎల్లపుడూ ముందు ఉంటానని, దేశానికి ఏదైనా సమస్య తలెత్తినపుడు.. దేశం కోసం నిలబడాలని,  ఆ సమయంలో ఏ పార్టీ అనేది చూడరాదు అని ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో దేశ ప్రధానిని, ఎప్పటికప్పుడు ప్రధాని తీసుకునే నిర్ణయాలని శశి థరూర్ ప్రశంసిస్తున్నారు. దీంతో థరూర్ కాంగ్రెస్ ని వీడి బీజేపీలోకి వెళ్తారని ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad