Saturday, February 8, 2025
Homeనేషనల్Sheesh Mahal: పగిలిన 'శీష్ మహల్', అసెంబ్లీ ఎన్నికలు శాసించిన సీఎం బంగ్లా

Sheesh Mahal: పగిలిన ‘శీష్ మహల్’, అసెంబ్లీ ఎన్నికలు శాసించిన సీఎం బంగ్లా

ఆప్ పతనం

ఇండియా ఎగనెస్ట్ కరప్షన్, ఆమ్ ఆద్మీ, ఆమ్ ఆద్మీ పార్టీ, చీపురు గుర్తు, అరవింద్ కేజ్రీవాల్.. ఇవి ఒకప్పుడు మోస్ట్ ట్రెండింగ్ పొలిటికల్ టాపిక్ గా దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలను ఆకట్టుకున్న అంశాలు. అలాంటి ఏఏపీ పార్టీ చివరికి ‘శీష్ మహల్’ పగలటంతో పతనం అంచుకు చేరుకుంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు పదేళ్లపాటు ఆప్ కు పట్టంకట్టగా, అదే ప్రజలు కేజ్రీవాల్ ను హ్యాట్రిక్ విజయానికి దూరం చేశారు.

- Advertisement -

లిక్కల్ మాఫియా చేతుల్లో బలై

2015, 2020లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ చివరికి లిక్కర్ మాఫియా చేతుల్లో చిక్కి ఓటమిపాలైంది. సౌత్ గ్రూప్ ఆధ్వర్యంలో సాగిన భారీ కుంభకోణానికి బలయ్యేలా దిగజారిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీతో ఖజానా నింపుకోవాలనే యోచనలో బై వన్ గెట్ వన్ అంటూ కేజ్రీవాల్ సర్కారు అనుసరించిన విధానాలు సామాన్యులను సైతం ఆప్ కు వ్యతిరేకంగా ఆలోచింపచేసే అంశాలనే అంచనాలు వెలువడుతున్నాయి.

కొంప కూల్చిన సౌత్ లాబీ

కేజ్రీవాల్ తో పాటు మనీష్ శిసోడియా, సంజయ్ సింగ్ వంటి వారు సౌత్ లాబీ చేతుల్లో బందీలుగా మారారన్న వార్తలు పూర్తగా వైరల్ అయి ఓటర్లను అత్యధికంగా ప్రభావితం చేసాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News