Saturday, November 15, 2025
Homeనేషనల్Sanjay Gaikwad: క్యాంటీన్‌ సిబ్బందిపై ఎమ్మెల్యే పిడిగుద్దులు.. వీడియో వైరల్

Sanjay Gaikwad: క్యాంటీన్‌ సిబ్బందిపై ఎమ్మెల్యే పిడిగుద్దులు.. వీడియో వైరల్

Shiv Sena MLA Sanjay Gaikwad: మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో వార్తతో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజాగా శివనసే షిండే వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా క్యాంటీన్ సిబ్బందిపై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ముంబైలోని వారి క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే బుల్దానా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ భోజనం ఆర్డర్ చేశారు. అయితే ఆయనకు వచ్చిన భోజనంలో పప్పు దుర్వాసన రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బనియన్, టవల్‌తోనే నేరుగా క్యాంటీన్ వద్దకు వచ్చారు.

- Advertisement -

తనకు అందించిన భోజనంలో పప్పు వాసన వస్తోందని.. దీనిని ఎవరు తయారుచేశారని కోపంతో రగిలిపోయారు. క్యాంటీన్ సిబ్బందిని నిలదీశారు. వారికి ఆ పప్పు వాసన చూపించారు. ఓ ఎమ్మెల్యే అయిన తనకు ఇలాంటి వాసన వచ్చే పప్పు వడ్డిస్తారా అని మండిపడ్డారు. ఈ పప్పు తిన్న వెంటనే తనకు కడుపు నొప్పి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే క్యాంటీన్ ఆపరేటర్‌పై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులతో విచక్షణారహితం దాడి చేడయంలో అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆయన దాడి ఆపలేదు. తనకే ఇలాంటి నాసిరకం పప్పు వడిస్తే వేలాది మంది ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు. క్యాంటీన్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: మద్యం మత్తులో అర్థనగ్నంగా MNS నేత కుమారుడు హల్చల్

దీంతో ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహారాష్ట్రలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు ఇలా ఉందంటూ ప్రతిపక్ష నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సిబ్బందిపై దాడి చేయడాన్ని సంజయ్ మాత్రం సమర్థించుకోవడం విశేషం. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే శివసేన స్టైల్ ఇదేనంటూ చెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే దాడి చేయడంపై శివసేన(షిండే) పార్టీ, మిత్రపక్షం బీజేపీ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా గతంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ నాలుక కోస్తే 11 లక్షల రూపాయలు బహుమనంగా ఇస్తానని బెదిరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad