Homeనేషనల్Population Control: "జనాభా నియంత్రణ వద్దు.. సంతానోత్పత్తి రేటు పడిపోతే చాలా కష్టం"

Population Control: “జనాభా నియంత్రణ వద్దు.. సంతానోత్పత్తి రేటు పడిపోతే చాలా కష్టం”

Shut Down Population Control Programmes: భారతదేశంలో జనాభా నియంత్రణ కార్యక్రమాలను నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ అన్నారు. దేశంలో సంతానోత్పత్తి రేటు (Fertility Rate) గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలను ఆపేయాలని ఆయన సూచించారు.

- Advertisement -

ALSO READ: Vande Bharat : ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే శుభవార్త.. ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్!

న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌డీటీవీ ప్రాఫిట్ జీఎస్‌టీ సదస్సులో పాల్గొన్న సంజీవ్ సన్యాల్, భారత జనాభా గమనంలో కీలక మార్పులు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో యువ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ, సంతానోత్పత్తి రేటు (TFR) వేగంగా పడిపోతోందని, ఇది భర్తీ రేటు (Replacement Rate) కంటే తక్కువగా ఉందని తెలిపారు.

“మన దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోయింది. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే సంతానోత్పత్తి రేటు అధికంగా ఉన్నప్పటికీ, అక్కడ కూడా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది,” అని ఆయన అన్నారు. ఏ దేశంలోనైతే సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోయిందో, ఆ దేశం మళ్లీ ఆ రేటును భర్తీ స్థాయికి తీసుకురాలేకపోయిందని ఆయన గుర్తు చేశారు.

“మన దేశంలో దశాబ్దాల క్రితం జనాభా విపరీతంగా పెరిగినప్పుడు, ఆ పెరుగుదలను అరికట్టడానికి జనాభా నియంత్రణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కానీ ప్రస్తుతం ఆ అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే 2021లో భారతదేశంలో 25 మిలియన్ల మంది పిల్లలు జన్మించగా, ఈ రోజు ఆ సంఖ్య 22 మిలియన్లకు తగ్గింది. ఇది చాలా వేగంగా తగ్గుతున్న సంఖ్య” అని సన్యాల్ పేర్కొన్నారు.

ALSO READ: Karnataka: దక్షిణాది రాష్ట్రంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. ముగ్గురు అరెస్ట్!

ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, దక్షిణాది రాష్ట్రాలతో పాటు జనాభా నియంత్రణ కార్యక్రమాలు విజయవంతమైన ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు తూర్పు ఆసియా దేశాల మాదిరిగా ఉందని ఆయన అన్నారు. “దేశంలోని కొన్ని ప్రాంతాలలో వలసల కారణంగా జనాభా మార్పులు వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నందున ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ALSO READ: Vice President: సంఘ్ నేత నుంచి.. ఉపరాష్ట్రపతి దాకా.. రాధాకృష్ణన్ ప్రస్తానమిదే..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News