HomeTop StoriesSiddaramaiah: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లను.. ఎమ్మెల్యేగానే కొనసాగుతా..! బాంబు పేల్చిన సిద్ధరామయ్య

Siddaramaiah: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లను.. ఎమ్మెల్యేగానే కొనసాగుతా..! బాంబు పేల్చిన సిద్ధరామయ్య

Siddaramaiah say goodbye to politics: కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడే తాను సీఎం పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. గవర్నర్‌ పంపిన తన రాజీనామా పత్రం త్వరలోనే ఆమోదం పొందుతుందనే సంపూర్ణ విశ్వాసంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సిద్ధరామయ్య పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. “నేను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. భవిష్యత్తులో ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. కానీ, 7 కోట్ల కన్నడ ప్రజలకు సేవ చేసే గొప్ప భాగ్యం నాకు దక్కింది. నా రాజకీయ జీవితంలో రాజ్యాంగమే నాకు ధర్మం.. ఓటర్లే నాకు దేవుళ్లు” అని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Also read: Silver rate: భారీగా పెరిగిన వెండి ధరలు..!.. ఉదయం తగ్గినట్లే తగ్గి.. మధ్యాహ్నానికి ఊహించని షాక్‌..!

అందుకే రాజ్యసభ ఆఫర్‌ను తిరస్కరించా..

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే తాను ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, భవిష్యత్తులో కూడా కర్ణాటక ప్రయోజనాల కోసమే పనిచేస్తానని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో హైకమాండ్ ఇచ్చిన ఆఫర్‌పై ఆయన స్పందిస్తూ.. “సీఎం పదవి నుంచి తప్పుకుంటే కేంద్ర రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ.. రాజ్యసభకు పంపుతామని హైకమాండ్ నాకు ఆఫర్ ఇచ్చింది. కానీ నాకు ఎలాంటి ఆఫర్లు వద్దని నేను స్పష్టం చేశాను. భవిష్యత్తులో కేవలం ఎమ్మెల్యే గానే కొనసాగుతానని పార్టీ పెద్దలకు చెప్పాను.” అని వెల్లడించారు. తాను పదవి నుంచి తప్పుకున్నప్పటికీ రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని సిద్దరామయ్య తేల్చి చెప్పారు. “నా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చేస్తూనే ఉంటా. నా రాజకీయ సిద్ధాంతాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదు.” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు, బీసీ నేతను సీఎం పదవి నుంచి దింపేసి.. అగ్రవర్ణ నేతకు పట్టం కట్టడంపై బీజేపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News