HomeTop StoriesSiddaramaiah: డీకేకు చెక్‌ పెట్టేందుకు సిద్దరామయ్య మాస్టర్‌ ప్లాన్‌.. అధిష్టానం ముందు కీలక ప్రతిపాదన..!

Siddaramaiah: డీకేకు చెక్‌ పెట్టేందుకు సిద్దరామయ్య మాస్టర్‌ ప్లాన్‌.. అధిష్టానం ముందు కీలక ప్రతిపాదన..!

Siddaramaiah’s latest proposal to High Command: కర్ణాటకలో రాజకీయం హాట్‌ హాట్‌గా సాగుతోంది. సిద్ధరామయ్య ఇప్పటికే తన సీఎం పదవికి రాజీనామా చేయగా.. తదుపరి సీఎంగా డీకే శివకుమార్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, సీఎం పదవిని వదులుకోవడం సిద్ధరామయ్యకు ఇష్టం లేకున్నా.. అధిష్ఠానం ఒత్తిడితో ఆయన ఎట్టకేలకు రాజీనామా చేశారు. అయితే, డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించడానికి ముందే.. పార్టీలో తన ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్నారు. డీకే సీఎం అయ్యాక పాలనపరంగానూ పట్టు నిలుపుకునేందుకు సిద్ధరామయ్య తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిన్న రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య తన కుమారుడితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు (శుక్రవారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీని కలిసి తన కుమారుడికి కీలకమైన శాఖలు అప్పగించాలని కోరారు. అంతేకాదు, మరో కీలక ప్రతిపాదన అదిష్టానం ముందుంచారు.

- Advertisement -

Also Read: NEET exam: ఇకపై సీబీటీ విధానంలోనే నీట్ నిర్వహిస్తాం.. సుప్రీంకోర్టుకు ఎన్టీఏ వివరణ

కో-ఆర్డినేషన్‌ కమిటీ వేయాలని ప్రపోజల్‌..

కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మధ్య సమన్వయం చేయడానికి ఒక కో-ఆర్డినేషన్ కమిటీ వేయాలని, తనకు ఛైర్మన్ బాధ్యతలను అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్‌ ముందు ప్రతిపాదన తీసుకువెళ్లారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ కమిటీ ఉంటే బాగుంటుందని సూచించారు. 2018లో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో సిద్ధరామయ్య సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, ఇప్పుడు మరోసారి ఈ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. అయితే, ఈ ప్రతిపాదన పట్ల హైకమాండ్‌ సానుకూలంగా లేదని తెలుస్తోంది. పార్టీకి సొంతగా మెజారిటీ ఉన్న నేపథ్యంలో సమన్వయ కమిటీ అవసరం లేదని అధిష్ఠానం చెప్పినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News