Indian Women Simran: పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం ఇండియా నుంచి అమెరికా వెళ్లిన భారతీయ మహిళ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. యువతి మిస్సింగ్ కావడంతో అమెరికా పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. భారత్‌లోని ఆ మహిళ కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రాన్ జూన్ 20న అమెరికా చేరుకుంది. పెద్దలు కుదిర్చిన వివాహం కోసం ఆ దేశానికి వచ్చినట్లు అమెరికా అధికారులకు తెలియజేసింది. కాగా, అమెరికా వచ్చిన కొన్నిరోజులకే సిమ్రాన్ అదృశ్యమైనట్లు న్యూజెర్సీ అధికారులు తెలిపారు. జూన్ 25న ఆమె చివరిసారి కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించినట్లు చెప్పారు. మొబైల్ ఫోన్ చూస్తున్న ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని అన్నారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/bjp-and-congress-party-leaders-fighting-for-ds-srinivas-statue-inaguaration/
మరోవైపు కుదిర్చిన పెళ్లి కోసం కాకుండా ఫ్రీగా ట్రావెల్ చేసేందుకు సిమ్రాన్ అమెరికా వచ్చి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సిమ్రాన్ ఇంగ్లీష్ మాట్లాడలేదని, అమెరికాలో ఆమెకు బంధువులు ఎవరూ లేరని తెలిపారు. భారత్‌లోని ఆమె బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదన్నారు. సిమ్రాన్ రూపురేఖలు, మిస్సింగ్‌కు ముందు ఆమె ధరించిన దుస్తులు, ఇతర వివరాలను వెల్లడించారు. ఆమె ఆచూకీ గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని లిండెన్‌వోల్డ్ పోలీస్ డిటెక్టివ్ జో టోమసెట్టి కోరారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-district-news/brs-leader-sensational-comments-on-cm-revanth-reddy-phone-tapping-case/
కాగా, సిమ్రన్ ఐదు అడుగుల నాలుగు అంగుళాల పొడవు, 68 కిలోల బరువు ఉంటుందని ఆమె గుర్తింపు వివరాలను కాప్స్ విడుదల చేశారు. నుదుటికి ఎడమవైపు ఒక చిన్న మచ్చ ఉందని చెప్పారు. చివరిసారిగా ఆమె తెల్ల టీ-షర్ట్, గ్రే రంగు స్వెట్‌ప్యాంట్స్ ధరించి ఉన్నారన్నారు. ఎవరైనా సిమ్రన్ ఆచూకీ తెలిసిన వారు లిండెన్‌వోల్డ్ పోలీస్ డిటెక్టివ్ జో టొమాసెట్టికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, సిమ్రాన్ ఐదు అడుగుల నాలుగు అంగుళాల పొడవు, 68 కిలోల బరువు ఉంటుందని ఆమె గుర్తింపు వివరాలను కాప్స్ విడుదల చేశారు. నుదుటికి ఎడమవైపు ఒక చిన్న మచ్చ ఉందని చెప్పారు. చివరిసారిగా ఆమె తెల్ల టీ-షర్ట్, గ్రే రంగు స్వెట్‌ప్యాంట్స్ ధరించి ఉన్నారన్నారు. ఎవరైనా సిమ్రన్ ఆచూకీ తెలిసిన వారు లిండెన్‌వోల్డ్ పోలీస్ డిటెక్టివ్ జో టొమాసెట్టికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే సిమ్రాన్ మిస్సింగ్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా ఆమెను కిడ్నాప్ చేశారా? ఎక్కడికి వెళ్లింది.. ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా అనే కోణాల్లో అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.