Sunday, November 16, 2025
HomeTop StoriesSIR: రేపటి నుంచి రెండో విడత 'SIR'.. 12 రాష్ట్రాల్లో అమలు- సీఈసీ

SIR: రేపటి నుంచి రెండో విడత ‘SIR’.. 12 రాష్ట్రాల్లో అమలు- సీఈసీ

‘SIR’ Completed in Bihar Elections: తొలి విడతలో బిహార్‌లో జరిపిన ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’(SIR) విజయవంతమైందని భారత ఎలక్షన్‌ కమిషన్‌ తెలిపింది. ఈ మేరకు SIR ప్రక్రియపై ఈసీ కీలక ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా రెండో విడతలో 12 రాష్ట్రాల్లో/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్’ రేపటి నుంచి(అక్టోబర్‌ 28) అమలు చేయబోతున్నట్లు సోమవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/today-central-election-commission-press-meet-on-special-integrated-revision/

బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో నకిలీ ఓట్లకు తావివ్వకుండా భారత ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటరు సర్వే ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఈసీ.. బిహార్‌లో విజయవంతంగా SIR ప్రక్రియ పూర్తయినట్లు తెలిపింది. SIR ప్రక్రియ ద్వారా నకిలీ ఓట్లు, అక్రమ వలసదారులు, చనిపోయినవారు, బదిలీ చేయబడిన ఓటర్ల తొలగింపు దిగ్విజయంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటుహక్కు కల్పించడమే లక్ష్యమని ఈసీ వెల్లడించింది. 

Also Read: https://teluguprabha.net/national-news/india-china-flights-resume-galwan/

కాగా, దేశంలో 21 ఏళ్ల క్రితం SIR ప్రక్రియ నిర్వహించినట్లు సీఈసీ జ్ఙానేశ్‌కుమార్‌ కుమార్‌ తెలిపారు. రేపటి నుంచి రెండో విడత కింద 12 రాష్ట్రాల్లో/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో సవరణలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఇవాళ అర్థరాత్రి ఓటర్ల జాబితా సీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. 

ఇక రెండో విడతలో భాగంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియను.. ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, లక్షద్వీప్‌, అండమాన్‌, గోవా, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అమలు చేయబోతున్నట్లు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ వెల్లడించారు. 

‘అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 వరకు SIR రెండో దశ పోలింగ్‌ అధికారులకు శిక్షణ ఉంటుంది. ఈ ఏడాది నవంబర్‌ 4 నుంచి డిసెంబర్‌ 3 వరకు.. ఎన్యుమరేషన్(ఇంటింటా ఓటరు గణన) నిర్వహిస్తారు. డిసెంబర్‌ 9న ముసాయిదా జాబితాను వెల్లడిస్తాం. జనవరి 8, 2026 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. డిసెంబర్‌ 9 నుంచి జనవరి 31, 2026 వరకు వెరిఫికేషన్‌ నిర్వహిస్తాం. ఫిబ్రవరి 7, 2026 న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తాం.’ అని సీఈసీ వివరించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad