Homeనేషనల్Property dispute: కళ్లలో కారం చల్లి.. కత్తులతో తెగ నరికి.. భూతగాదాతో ఆరుగురి హత్య..!

Property dispute: కళ్లలో కారం చల్లి.. కత్తులతో తెగ నరికి.. భూతగాదాతో ఆరుగురి హత్య..!

Six killed in clash due to Property dispute: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదా కారణంగా జరిగిన ఘర్షణలో ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. విజయపుర జిల్లా గోవిందవాడలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ కుటుంబంలో 10 ఎకరాల ఆస్తికి సంబంధించిన వివాదానికి సంబంధించిన సమస్య పరిష్కారానికి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో బంధువులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రత్యర్థి వర్గంపై పథకం ప్రకారం కళ్లలో కారం చల్లి అందరూ చూస్తుండగానే కత్తులతో నరికి చంపేశారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం అందర్నీ కలిచి వేస్తోంది. విజయపుర పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ దారుణమైన ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Also Read: Siddaramaiah: డీకేకు చెక్‌ పెట్టేందుకు సిద్దరామయ్య మాస్టర్‌ ప్లాన్‌.. అధిష్టానం ముందు కీలక ప్రతిపాదన..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News