Dhruv Rathee on PM Modi: ప్రధాన మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు నిజం కాదని ప్రముఖ యూట్యూబర్ మరియు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాథీ ఆరోపణలు చేశాడు. ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పేలా ఆయన టీమ్ ముందే వారికి టూల్ కిట్ ఇచ్చిందన్నారు. రాథీపై మోదీ అభిమానులు మండిపడుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్ కు కూడా టూల్ కిట్ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ధ్రువ్ రాథీ. రాజకీయ విశ్లేషణలతో నెట్టింట మంచి పేరు తెచ్చుకున్నాడు. గతంలో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ధ్రువ్ చేసిన వీడియోలు సంచలన రేపాయి. అతడి ధైర్యమే 2023లో ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ‘తర్వాత తరం నాయకులు’ లిస్ట్ లో ఆయనను చేర్చింది.
Also Read: Viral Video -ఈ అక్కా టాలెంట్ సూపర్.. కాకులను ఎలా మోసం చేసిందో చూడండి..
ధ్రువ్ రాథీ హర్యానాకు చెందినవాడు. ఇతడు రోహతక్ లో 1994లో జన్మించారు.జర్మనీలో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి.. 2013 జనవరి 8న తన పేరుతో యూట్యూబ్ చానెల్ మెుదలుపెట్టాడు. తరుచూ తన ఛానెల్ లో పొలిటికల్ డిబేట్స్ చేసి యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అతడి ఛానెల్ కు దాదాపు 30 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇతడు పొలిటికల్ వీడియోస్ తోపాటు సామాజిక, పర్యావరణ సమస్యలకు సంబంధించిన వీడియోలను కూడా చేస్తాడు. హిందీలో ఇతడికి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. కేవలంలో హిందీలోనే కాకుండా రీసెంట్ గా ధ్రువ్ రాథీ తెలుగు, మరాఠీ, కన్నడ, తమిళం, బెంగాలీలో కూడా కొత్త యూట్యూబ్ చానెళ్లను ప్రారంభించారు.


