Saturday, November 15, 2025
Homeనేషనల్Somalia Ship Catches Fire: బియ్యం తరలిస్తున్న నౌకలో మంటలు.. బస్తాలు అగ్నికి ఆహుతి 

Somalia Ship Catches Fire: బియ్యం తరలిస్తున్న నౌకలో మంటలు.. బస్తాలు అగ్నికి ఆహుతి 

Ship Catches Fire: గుజరాత్‌లోని పోర్‌బందర్‌ నుంచి సొమాలియా వెళ్లే నౌకలో మంటలు చెలరేగాయి. సుభాష్ నగర్ జెట్టీ వద్ద లంగరు వేసిన కార్గో షిప్‌లో సోమవారం ఉదయం మంటలు వ్యాపించడం కలకలం సృష్టించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే మూడు అగ్నిమాపక వాహనాలను అక్కడికి తరలించి నౌకలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/digital-arrest-scam-mp-sudhakar-wife-preeti-14-lakh-fraud/

జామ్‌నగర్‌లోని హెచ్‌ఆర్‌ఎం అండ్‌ సన్స్‌ కంపెనీకి చెందిన ఈ నౌకలో బియ్యం బస్తాలు లోడ్‌ చేయగా.. ఈ బస్తాలకు మంటలు వ్యాపించడంతో తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఆ కార్గో షిప్‌ను సముద్రంలోకి లాక్కెళ్లారు. మరోవైపు బియ్యం లోడ్‌ ఉన్న ఆ నౌక సొమాలియాలోని బొసాసోకు వెళ్లాల్సి ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. అందులో మంటలు చెలరేగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ నౌక నుంచి మంటలు ఎగసిపడుతున్న వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad