కాంగ్రెస్ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఉదర సంబంధిత సమస్యల కారణంగా ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. కొన్ని చికిత్సల అనంతరం ఆరోగ్యం కుదుటపడటంతో సోనియాను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
- Advertisement -
కాగా కొంతకాలంగా సోనియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 78 ఏళ్లు నిండిన సోనియా గాంధీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 13న బహిరంగంగా చివరిసారి కనిపించారు.