సర్ గంగారాం ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రేపు డిస్చార్జ్ అవ్వనున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నట్టు దీంతో శుక్రవారం డిస్చార్జ్ చేయనున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ లో బర్త్ డే జరుపుకున్న సోనియాకు ప్రస్తుతం 78 ఏళ్ల వయసు కాగా పలు అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. అయితే సోనియా ఎప్పుడు ఏ అనారోగ్యంతో అడ్మిట్ అయ్యారన్న విషయాన్ని ఇప్పటివరకూ పార్టీ, కుటుంబ సభ్యులు వెల్లడించకపోవటం విశేషం. బహుశా గురువారం ఉదయం ఆమెను అడ్మిట్ చేసినట్టు సమాచారం. వైద్యుల బృందం పర్యవేక్షలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Sonia Gandhi: రేపు ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అవుతున్న సోనియా గాంధీ
చికిత్సలో..