Saturday, November 15, 2025
Homeనేషనల్Railway Jobs : గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 3518 ఖాళీలు.. ఇప్పుడే అప్లై చేయండి!

Railway Jobs : గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 3518 ఖాళీలు.. ఇప్పుడే అప్లై చేయండి!

Railway Jobs : నిరుద్యోగులకు శుభవార్త! దక్షిణ రైల్వే చెన్నై 3518 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 25, 2025 నుంచి సెప్టెంబర్ 26, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.6000-7000 స్టైఫండ్ లభిస్తుంది.

- Advertisement -

ALSO READ: Medak Floods: మెదక్ వరదలు: పౌల్ట్రీ ఫాం ధ్వంసం, వేల కొద్దీ కోళ్ల మృతి..!

వెకెన్సీ వివరాలు:

మొత్తం పోస్టులు: 3518

విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మెన్ మొదలైనవి.

ప్రధాన యూనిట్లు:

క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్స్, పెరంబూర్: 1394 పోస్టులు

సెంట్రల్ వర్క్‌షాప్, గోల్డెన్ రాక్: 857 పోస్టులు

సిగ్నల్ అండ్ టెలికమ్ వర్క్‌షాప్, పొడనూర్: 1267 పోస్టులు

విద్యార్హత: 10వ తరగతి, ఇంటర్ లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయస్సు: 2025 జనవరి 1 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ వారికి 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సు సడలింపు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు.

ఎంపిక విధానం: 10వ తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా, డాక్యుమెంట్ వెరిఫికేషన్.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో https://sronline.etrpindia.com వెబ్‌సైట్ ద్వారా అప్లై చెయ్యండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఇప్పుడే దరఖాస్తు చేయండి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad