Homeనేషనల్Goa: గోవాకు ఆధ్యాత్మిక శోభ.. మాండవీ నదికి కాశీలో తరహా గంగా హారతి!

Goa: గోవాకు ఆధ్యాత్మిక శోభ.. మాండవీ నదికి కాశీలో తరహా గంగా హారతి!

Ganga Aarti at Mandovi River: గోవా అంటేనే సాధారణంగా మందు, చిందూ, బీచులు గుర్తుకువస్తాయి. కానీ ఇకనుంచి గోవాలో ఆధ్యాత్మిక పరిమళం మొదలుకానుంది. గోవాకు వచ్చే పర్యాటకుల సంఖ్య విపరీతంగా పడిపోవటంతో టూరిస్టులను ఆకట్టుకునేందుకు గోవా ప్రభుత్వం సరికొత్త మార్గంలో వెళ్తుంది.

- Advertisement -

టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ ర్యాంక్ నుంచి గోవా తన స్థానాన్ని కోల్పోయింది. అయితే కసినోలు, బీచులు, పబ్‌లున్నా టూరిజంలో ఈ రాష్ట్రం వెనుకబడుతోంది. కాశీ కారిడార్ అభివృద్ధి చేశాక పర్యాటకులంతా అటువైపే వెళ్తున్నారు. దీంతో గోవా ప్రభుత్వం సరికొత్త మార్గాన్ని అన్వేషించింది. గోవాలోని అత్యంత పురాతన గుళ్లు, చర్చిలు ఉన్నాయి. ఫ్యామిలీలను అట్రాక్ట్ చేసే రేస్‌లో ముందుండాలంటే ఇక్కడ గంగా హారతి తరహా మాండవీ హారతి పెట్టాలని గోవా సర్కారు నిర్ణయించింది. ఈమేరకు పనులు సైతం ప్రారంభమయ్యాయి.

మాండవీ నదికి అధ్యాత్మిక శోభ: గోవాలో హారతి సంప్రదాయానికి శ్రీకారం చుట్టేందుకు గోవాలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. కాశీలోని గంగా హారతి తరహాలో గోవాలో హారతి ఏర్పాటు చేసేందుకు ఏకంగా పదిన్నర కోట్లు బడ్జెట్‌ను సైతం సర్కార్‌ కేటాయించింది. గోవాలోని మాండవీ నది ఒడ్డున ఘాట్ నిర్మించి హారతి కార్యక్రమాన్ని రోజూ నిర్వహించేందుకు సన్నాహకాలు సాగుతున్నాయి. దీన్ని టూరిస్టుల కోసం నిర్మిస్తున్న ఓ ఆధ్యాత్మిక ప్రాజెక్టుగా గోవా ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే మాండవీ నదిపైనే తేలియాడే కసినోలున్నాయి. అయితే ఇప్పుడిక్కడ మాండవీ ఘాట్ కట్టి, సాయంత్రం సంప్రదాయబద్ధంగా హారతి ఇస్తారు. దీంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ఇకనుంచి దీపాలు, హారతి, మంత్రాలతో గోమాంతక దీవులు వెలిగిపోనున్నాయి. శివుడి భారీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసి గోవా పర్యాటకాన్ని ఉత్తరాఖండ్ పర్యాటకంతో అనుసంధానం చేసే యత్నాలు జోరుగా సాగుతున్నాయి.

Also read-Vastu:అరటి చెట్టు.. ఇలా పూజిస్తే మీ కష్టాలన్నీ పరుగో పరుగు!

ఇక పర్యాటకానికి తిరుగుండదు: మాండవీ నది గోవాకు జీవనాధారం. గోవా రాష్ట్రంలో ప్రధాన నదులలో మాండ్వీ ఒకటి కాగా ఇది పశ్చిమ కనుమల్లో పుట్టి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది గోవా ప్రస్తుత రాజధాని పనాజీని పూర్వ రాజధానైన ఓల్డ్ గోవాతో కలుపుతుంది. మాండవీ నదిపైన ఉన్న నార్వేలో పురాతన సప్తకోటేశ్వర శివాలయం వద్ద భారీ శివ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, హారతి ఘాట్లు, కూర్చొనేందుకు అనువుగా సీట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరో 10 నెలల్లో ఇక్కడ హారతి ప్రారంభించేందుకు పనులు జోరందుకున్నాయి. గోవాలో హిందూ జనాభా అత్యధికం కాగా స్పిరుచువల్ టూరిజంను అభివృద్ధి చేస్తే తమ రాష్ట్రానికి ఇక తిరుగుండదని ఇక్కడి సర్కారు లెక్కలేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News