Saturday, November 15, 2025
Homeనేషనల్Haridwar: ఆలయంలో తొక్కిసలాట.. 30 మందికి గాయాలు

Haridwar: ఆలయంలో తొక్కిసలాట.. 30 మందికి గాయాలు

Manasa Devi Temple: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని మానసా దేవి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. శివాలిక్‌ కొండల్లో 500 అడుగుల ఎత్తులో మానసా దేవి ఆలయం ఉంది. ఆదివారం సెలవు దినం సందర్భంగా పలు రాష్ట్రాల నుండి భక్తులు అమ్మవారి దర్శనం కోసం వందలాది మంది రావటం జరిగింది. ప్రధాన ఆలయానికి వెళ్లే మెట్ల మార్గంపై అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ అనుకోని ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందగా, 30 మంది భక్తులు గాయపడ్డారు. అందులో ఐదు మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

విద్యుత్ షాక్ పుకార్లు రావడంతో మెట్ల మార్గంపై వెళ్తున్న భక్తులు భయాందోళనకు గురై ఒక్కసారిగా పరుగులు తీయడంతో ఈ విషాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరుష్ (12), వివేక్ (18), వకీల్, శాంతి, ఉత్తరాఖండ్‌కు చెందిన విపిన్ సైని (18), బీహార్‌కు చెందిన షకల్ దేవ్ (18) ఉన్నారు.

Readmore: https://teluguprabha.net/national-news/pm-modi-prayers-at-gangaikonda-cholapuram-temple/

గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ.. ఆలయం వద్ద భక్తులు గుమిగూడి ఉండటం మూలానే ఇది జరిగిందని, ఈ ఘటనలో గాయపడిన వారిని అంబులెన్స్‌లలో సమీప ఆసుపత్రులకు తరలించామని తెలిపారు.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ స్పందిస్తూ.. ఇది చాలా బాధాకరమైన విషయం అని, ఉత్తరాఖండ్ పోలీసుల రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. ఈ విషయంపై స్థానిక అధికారుల‌తో నేను నిరంతరం సంప్రదిస్తున్నాను. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాను. భక్తులందరి భద్రత, శ్రేయస్సు కోసం నేను ఆ దేవతను ప్రార్థిస్తున్నాను అని సీఎం అన్నారు.

Readmore: https://teluguprabha.net/national-news/one-killed-21-injured-as-truck-rams-over-25-vehicles-on-mumbai-pune-expressway/

ఉత్తరాఖండ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితుల కోసం పోలీసులు హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. ఉత్తరాఖండ్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు: 94111 12973, 9520625934.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad