Stampede In Vijay Sabha: తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, తమిళగ వెట్రీ కజగం(టీవీకే) అధినేత విజయ్ నిర్వహించిన రోడ్ షోలో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 31 మంది మరణించినట్లు సమాచారం. మరణించిన వారిలో ఆరుగురు చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. చాలా మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్న మరో 40 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
కాగా, తొక్కసలాట జరిగిన వెంటనే విజయ్ అర్ధాంతరంగా తన ప్రసంగాన్ని ముగించేశారు. కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో పరిస్థితిని పోలీసులు నియంత్రించలేకపోయారు. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. అనేక మంది స్పృహ కోల్పోయారు. పరిస్థితి తీవ్రతను గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వారికి నీళ్ల బాటిళ్లను అందించారు.
Also Read: https://teluguprabha.net/national-news/bsnl-4g-swadeshi-launched-by-pm-narendra-modi-in-odisha/
భారీ సమూహంలో అంబులెన్సులు అక్కడకు చేరుకోవడంతో ఇబ్బంది వాతావరణం నెలకొంది. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. అతి కష్టం మీద బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ‘X’ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు సరైన వైద్య సదుపాయం కల్పించాలని ఆరోగ్య శాఖ, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


