HomeTop StoriesPakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 24 మంది జవాన్లు మృతి

Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 24 మంది జవాన్లు మృతి

Suicide attack on Zafar Express: పాకిస్థాన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై ఆత్మాహుతిదాడి తీవ్ర కలకలం రేపింది. క్వెట్టా నగరంలోని చమన్ ఫాటక్ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించింది. నేటి ఉదయం 8 గంటలకు జరిగిన ఈ భారీ పేలుడు దాటికి 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 80 మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చమన్‌ ఫాటక్‌ స్టేషన్‌ సమీపంలోని సిగ్నల్‌ దాటుతుండగా.. ఓ పేలుడు పదార్థాలతో అతివేగంగా వచ్చిన ఓ వాహనం రైలు బోగీని ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించిందన్నారు. మృతుల్లో ఎక్కువమంది సైనికులే ఉండటం గమనార్హం. ఈ భారీ పేలుడు దాటికి రైలు భోగీలు దెబ్బతిన్నాయి. అంతేకాదు, 10కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థిలిలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే స్టేషన్‌ సమీపంలో పేలుడు జరగడంతో రైళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్‌లోనే నిలిపివేసినట్లు వెల్లడించారు. పేలుడు జరిగిన ప్రాంతానికి ప్రజలు రావొద్దని, గుమికూడవద్దని పాక్‌ హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Also read: Sachin: ఆటతో ఆకట్టుకున అర్జున్ టెండూల్కర్.. గాడ్ ఆఫ్ క్రికెట్ ఎమోషనల్ పోస్ట్!

మేమే దాడి చేశామన్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ

అయితే, ఈ బాంబు పేలుళ్లు తమ పనేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించుకుంది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాక్‌ దళాల సిబ్బందిని తీసుకువెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకొని దాడి జరిపినట్లు పేర్కొంది. బలోచ్‌ ఆర్మీలోని మహిళా షైనాజ్ బలోచ్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. పాక్‌ నేతలు ప్రజలను తీవ్రంగా అణచివేస్తున్నారని, తమ సంస్కృతి, గుర్తింపు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. అణచివేతకు గురైన ప్రతి బలోచ్ బిడ్డ తన మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, ఇలాంటి ఆత్మాహుతి దాడులు మరిన్ని చేస్తామని హెచ్చరించారు.

ఉగ్రవాదులు, రెబల్స్‌ టార్గెట్లో ఎప్పటి నుంచో..

కాగా, జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌కు కొన్నేళ్లుగా ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. బలోచ్‌ రెబల్స్‌, తెహ్రీకే తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) గ్రూప్‌ ఈ రైలును పలుమార్లు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాయి. ఈ రైల్లో తరచూ సైనిక దళాలను క్వెట్టా నుంచి పంజాబ్‌కు తరలిస్తుండంతో దీన్ని ఉగ్రవాదులు టార్గెట్‌ చేసుకున్నారు. 2018, 2023లో పలుమార్లు దీనిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. తాజాగా కూడా సైనిక కుటుంబాలు ప్రయాణిస్తుండగానే దాడి జరగడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News