Supreme Court Appointed SIT Clean Chit to Vantara: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం ‘వంతార’కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వంతారపై వచ్చిన ఆరోపణల విచారణకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), సంస్థకు క్లీన్‌చిట్ ఇచ్చింది. జంతువుల దిగుమతిలో ఎలాంటి చట్టపరమైన ఉల్లంఘనలు జరగలేదని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది.
ALSO READ: Ornamental fish : చేపల పెంపకంలో ‘రంగుల’ విప్లవం! ఒడిశాలో నిరుద్యోగులకు కొత్త ఉపాధి మార్గం!
వంతార జంతువులను అక్రమంగా తరలిస్తోందంటూ మీడియా, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఆగస్టు 25న ఒక సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ సమర్పించిన నివేదికను సోమవారం పరిశీలించిన జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. “వంతారకు జంతువుల దిగుమతి అనేది బహుళ స్థాయిలలో, అనేక చట్టబద్ధమైన అధికారుల అనుమతులు, సంక్లిష్టమైన ప్రక్రియల తర్వాతే జరిగింది. చెల్లుబాటయ్యే పర్మిట్లు జారీ అయ్యాకే దిగుమతులు జరిగాయి” అని కోర్టు పేర్కొంది.
ALSO READ: ROAD ACCIDENT: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం… బీఎండబ్ల్యూ ఢీకొని ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి!
సిట్ నివేదిక ప్రకారం, వంతారలోని సౌకర్యాలు నిర్దేశిత ప్రమాణాల కంటే మెరుగ్గా ఉన్నాయి. జంతు సంరక్షణ, వైద్య సేవల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నారని, మరణాల రేటు కూడా ప్రపంచ సగటుకు అనుగుణంగానే ఉందని సిట్ తేల్చింది. దేవాలయాల నుంచి ఏనుగులను తరలిస్తున్నారన్న పిటిషనర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. “దేవాలయాలలో జంతువులను హింసిస్తున్నారు. అలాంటి వాటిని ఎవరైనా చట్టప్రకారం దత్తత తీసుకుని సంరక్షిస్తే తప్పేంటి?” అని ధర్మాసనం ప్రశ్నించింది.
సిట్ నివేదికపై వంతార బృందం హర్షం వ్యక్తం చేసింది. “సుప్రీంకోర్టు నియమిత సిట్ నివేదిక మా నిజాయితీని నిరూపించింది. ఇది మాకు గొప్ప ఉపశమనం. మూగజీవుల సేవను మరింత అంకితభావంతో కొనసాగించడానికి ఈ తీర్పు మాకు స్ఫూర్తినిస్తుంది” అని ఒక ప్రకటనలో తెలిపింది.
ALSO READ: Supreme Court: రాజకీయ పార్టీలకు ‘పోష్’ చట్టం వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు


