CJI Surya Kant properties : భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుత CJI జస్టిస్ భూషణ్ ఆర్. గవాయ్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకాన్ని ఖరారు చేశారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం (అక్టోబర్ 31, 2025) నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ CJI పదవిని చేపట్టనున్నారు. ఆయన 53వ CJIగా, 2027 ఫిబ్రవరి 9 వరకు సుమారు 14 నెలలు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త సీజేఐ ఆస్తుల వివరాలు వైరల్ గా మారాయి.
జస్టిస్ సూర్యకాంత్ ఆస్తి వివరాలివే – జస్టిస్ సూర్యకాంత్, భార్యతో కలిసి రూ.8 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో వెల్లడైన వివరాల ప్రకారం, ఆయన పేరు మీద 16 ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు (FDలు) ఉన్నాయి. వాటి మొత్తం విలువ (వడ్డీతో) రూ.4,11,22,395. భార్య పేరు మీద 6 FDలు రూ.1,96,98,377 విలువ. కుటుంబం పేరు మీద మరో 15 FDలు రూ.1,92,24,317. మొత్తం FDలు రూ.8 కోట్లకు పైగా ఉన్నాయి.
ALSO READ: Viral: ఆడబిడ్డ కన్నీటి గాథకు స్పందన: 24 గంటల్లో తడిసిన ధాన్యం కొనుగోలు
సీజేఐకు స్వయంగా 100 గ్రాముల బంగారం, భార్య పేరు మీద 1 కేజీ బంగారు ఆభరణాలు కలిగి ఉన్నారు. వారి వద్ద 6 కేజీల వెండి సామగ్రి ఉంది. ఆయన పేరు మీద కారు లేదు. కానీ భార్య పేరు మీద వ్యాగనార్ కారు ఉంది. చండీగఢ్ సెక్టార్ 10లో భార్య పేరు మీద ఇల్లు, పంచకూల గోల్పురా గ్రామంలో 13.5 ఎకరాల వ్యవసాయ భూమి, న్యూ చండీగచ్‌లో 500 చదరపు గజాల స్థలం ఉన్నాయి.
న్యూ ఢిల్లీలో 285 చదరపు గజాల ఇల్లు, గురుగ్రామ్‌లో 300 చదరపు గజాల స్థలం, చండీగచ్ సెక్టార్ 18లో 192 చదరపు గజాల స్థలం కలిగి ఉన్నారు. హిసార్ జిల్లా పెట్వార్ గ్రామంలో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పెద్ద కుమార్తె పేరు మీద 8 FDలు రూ.34,22,347, చిన్న కుమార్తె పేరు మీద 7 FDలు రూ.25,20,665 విలువ. ఇద్దరు కుమార్తెల వద్ద 100 గ్రాముల చొప్పున బంగారు ఆభరణాలు ఉన్నాయి.
జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానా హిసార్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. హిసార్ ప్రభుత్య పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో డిగ్రీ, 1984లో మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం (రోహ్‌తక్) నుంచి LLB పట్టా పొందారు. అదే సంవత్సరం హిసార్‌లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 1985లో చండీగచ్‌కు మారి, పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు.
2000 జూలై 7న హర్యానా అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు జడ్జ్‌గా పదోన్నతి పొందారు. 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జ్‌గా చేరారు. ప్రస్తుతం జాతీయ న్యాయ సేవల అథారిటీ (NALSA) సభ్యుడిగా, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా సేవలందిస్తున్నారు.
జస్టిస్ సూర్యకాంత్ పదవి చేపట్టడంతో, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో కొత్త దిశానిర్దేశం ఆరంభమవుతుందని న్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం “జస్టిస్ సూర్యకాంత్ న్యాయవ్యవస్థకు కొత్త శక్తి” అని అభివర్ణించింది. భారత ప్రజలు, న్యాయవేత్తలు ఈ మార్పును స్వాగతించారు.
ప్రస్తుత CJI జస్టిస్ గవాయ్ 2025 నవంబర్ 23న 65 ఏళ్ల వయసులో రిటైర్ అవుతారు. భారత రాజ్యాంగం 124 (2) విభాగం ప్రకారం, సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తదుపరి CJIగా నియమించే సంప్రదాయం ప్రకారం, జస్టిస్ సూర్యకాంత్ పేరును గవాయ్ సిఫార్సు చేశారు. ఈ నియామకం భారత న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టుతుందని కేంద్ర న్యాయ శాఖ అధికారులు చెప్పారు.


