Saturday, November 15, 2025
Homeనేషనల్Supreme Court: ఢిల్లీలో 'లుంగీ' కట్టారని దాడి.. హిందీ మాట్లాడాలంటూ కేరళ విద్యార్థులపై వేధింపులు! సుప్రీంకోర్టు...

Supreme Court: ఢిల్లీలో ‘లుంగీ’ కట్టారని దాడి.. హిందీ మాట్లాడాలంటూ కేరళ విద్యార్థులపై వేధింపులు! సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

Supreme Court of India Delhi Kerala Students: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ షాకింగ్ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేరళకు చెందిన ఇద్దరు విద్యార్థులు తమ సాంప్రదాయ వస్త్రధారణ అయిన ‘లుంగీ’ ధరించారన్న కారణంతో దాడికి గురయ్యారు. ఎర్రకోట సమీపంలో ఈ ఘటన జరగ్గా, కొందరు స్థానికులతో పాటు పోలీసులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలోని జాకీర్ హుస్సేన్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థులను అడ్డగించి, హిందీలోనే మాట్లాడాలంటూ బలవంతం చేసి, వారి వస్త్రధారణను ఎగతాళి చేసినట్లు సమాచారం.

- Advertisement -

ఈ ఘటనపై జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం మంగళవారం తీవ్రంగా స్పందించింది. “మనం ఒకే దేశం” (We are one country) అని నొక్కి చెప్పిన కోర్టు, ఈ దేశంలో సాంస్కృతిక, జాతి (Racial) భేదాల కారణంగా ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించింది.

ALSO READ: Encounter: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత.. ఆరుగురు మావోయిస్టుల హతం

దేశంలో, ముఖ్యంగా ఢిల్లీలో, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో 2015లో ఒక పిటిషన్ దాఖలైంది. అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి నిడో తానియా మరణం తర్వాత ఈ అంశం తీవ్రరూపం దాల్చింది. జాతి వివక్ష, దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అప్పట్లో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

మంగళవారం నాటి విచారణలో, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) కె.ఎం. నటరాజ్ వాదిస్తూ, ఇప్పటికే ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశామని, ఇక ఈ పిటిషన్‌లో ఏమీ మిగిలిలేదని అన్నారు.

ALSO READ: Father daughter love: తండ్రి ప్రేమంటే ఇలానే ఉంటది.. రూపాయ్ రూపాయ్ దాటి కూతురి కోసం స్కూటీ..

అయితే, పిటిషనర్ తరఫు న్యాయవాది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జాతి వివక్ష దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, తాజా కేరళ విద్యార్థుల ఘటనే ఇందుకు నిదర్శనమని వాదించారు. అంతేకాదు, త్రైమాసికానికి (మూడు నెలలకు) ఒకసారి సమావేశం కావాల్సిన ఆ కమిటీ, గత 9 ఏళ్లలో కేవలం 14 సార్లు మాత్రమే సమావేశమైందని కోర్టు దృష్టికి తెచ్చారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం, “సామరస్యంగా జీవించే దేశంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదు,” అని వ్యాఖ్యానించింది. కేంద్రం దాఖలు చేసిన తాజా నివేదికపై స్పందన తెలియజేయాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.

ALSO READ: PM Modi: ‘మాట ఇస్తున్నా.. దిల్లీ పేలుడు బాధ్యులను వదిలిపెట్టను’

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad