HomeTop StoriesSC: స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదు- వ్యభిచార వృత్తిపై సుప్రీంకోర్టు సంచలన మార్గదర్శకాలు 

SC: స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదు- వ్యభిచార వృత్తిపై సుప్రీంకోర్టు సంచలన మార్గదర్శకాలు 

Supreme Court Human Trafficking: సెక్స్ వర్కర్లను గౌరవంగా పరిగణించాలని, వారి గోప్యతను కాపాడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం పోలీసు యంత్రాంగం, అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏ రకమైన రెస్క్యూ ఆపరేషన్‌లోనూ వారి గుర్తింపును బహిర్గతం చేయకూడదన్న ధర్మాసనం మీడియాకు వారి వివరాలు లీక్ చేయకూడదని ఆదేశించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/congress-sir-master-trainers-training-gandhi-bhavan-hyderabad/

మానవ అక్రమ రవాణా నిరోధంపై శుక్రవారం సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు జారీ చేసింది. స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని ఆదేశించింది. స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇష్టపూర్వకంగా సెక్స్‌ వర్క్‌ చేసే వయోజనులను వేధించవద్దని వెల్లడించింది. దాడులు చేయడం, క్రిమినల్‌ కేసులు పెట్టడం చట్టవిరుద్ధం అని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు ఉందన్న ధర్మాసనం.. రెస్క్యూ ఆపరేషన్లలో ఫొటోలు, వీడియోలు ప్రసారం చేయడం నేరమని పేర్కొంది. అలా చేస్తే.. అది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని వ్యాఖ్యానించింది. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-govt-hikes-peddi-movie-ticket-prices/

మరో వైపు హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తీర్పులు ఆలస్యం చేయొద్దని.. ఈ మేరకు రిజర్వ్ చేసిన తీర్పులపై అన్ని హైకోర్టులకు గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. పూర్తి కారణాలతో కూడిన తీర్పు 7 రోజుల్లో అప్‌లోడ్‌ చేయాలని.. ప్రత్యేక పరిస్థితుల్లో 15 రోజుల్లో తీర్పు అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది. ప్రకటించిన తీర్పు 24 గంటల్లోపు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలన్న ధర్మాసనం.. 3 నెలల్లో తీర్పు రాకపోతే కేసు చీఫ్‌ జస్టిస్‌ దృష్టికి వెళ్లాలని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News