ఇటీవల న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. ఏకంగా హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లోనే నల్ల డబ్బు దొరకడంతో న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయముర్తులు (Supreme Court judges) కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఆస్తులను(Assests) ప్రకటించడానికి ఏకగ్రీవంగా అంగీకరించారు.
ఇది పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడింది. ఈ నిర్ణయం ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదం పొందింది. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)తో సహా సుప్రీంకోర్టులోని 34 మంది సిట్టింగ్ న్యాయమూర్తులలో 28 మంది తమ ఆస్తులు వివరాలను CJIకి సమర్పించారు. ఇక న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఈ నిర్ణయంతో ప్రజల్లో న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.