Friday, November 22, 2024
Homeనేషనల్Supreme Court: బుల్డోజర్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court: బుల్డోజర్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court| నిందితుల ఆస్తులను బుల్డోజర్ల(Bulldozer)తో కూల్చివేయడంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తి దోషి అని అధికారులు తేల్చిచెప్పలేరని తెలిపింది. అధికారులే జడ్జిలాగా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని స్పష్టంచేసింది.

- Advertisement -

కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కారణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వివిధ రాష్ట్రాలు, ఆయా ప్రభుత్వాల అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కూల్చివేతల ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ఆస్తి పునరుద్ధరణకు సంబంధించిన పరిహారాన్ని అధికారుల జీతం నుంచి వసూలు చేస్తామని పేర్కొంది.

ఉత్తరప్రదేశ్‌లో నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం తొలుత ప్రారంభమైంది. అనంతరం ఇతర రాష్ట్రాలకు కూడా ఈ ధోరణి పాకింది. దీంతో నిందితుల ఇళ్లు, ప్రైవేటు ఆస్తులను కూల్చివేయడం ఎక్కువైపోయాయి. అధికారుల తీరుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు నమోదయ్యాయి. వీటిపై విచారించిన న్యాయస్థానం ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News