Thursday, March 12, 2026
Homeనేషనల్Supreme Court: పెళ్లికి ముందే ఆ రిలేషన్‌ ఎలా.?- అత్యాచార కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక...

Supreme Court: పెళ్లికి ముందే ఆ రిలేషన్‌ ఎలా.?- అత్యాచార కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court on Physical Relationships: పెళ్లికి ముందే శారీరక సంబంధాల్లోకి ఎలా వెళ్తారో అని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఓ బంధాన్ని ఏర్పరుచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. పెళ్లికి ముందే ఎవరూ ఎవరినీ నమ్మకూడదని హితవు పలికింది. సోమవారం ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/billgates-tour-completed-in-ap-pawan-kalyan-wishes/

పెళ్లి పేరుతో ఓ మహిళను అత్యాచారం చేసిన కేసులో నిందితుడి బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జస్టిస్‌ బి.వి. నాగరత్న, జిస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. వివాహానికి ముందు శారీరక సంబంధంలోకి ప్రవేశించేముందు జాగ్రత్త వహించాలని ఈ తరం యువతులకు సూచించారు. ‘మనం పాతకాలపు వాళ్లం.. యువతీయువకులు అవరిచితులు.. పరిచయం తర్వాత వారి సంబంధం ఎంత బలంగా ఉన్నా పేలవంగా ఉన్నా.. పెళ్లికి ముందే శారీరక సంబంధంలోకి ఎలా వెళ్లగలుగుతున్నారో అర్థం చేసుకోలేకపోతున్నాం.’ అని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

యువతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను చాలా జాగ్రత్తగా ఉండాలని.. పెళ్లికి ముందు ఎవరూ ఎవరినీ నమ్మకూడదని సూచించింది. కాగా, యువతీయువకులు 2022లో మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ వెబ్‌సైట్ ద్వారా కలుసుకున్నారని కోర్టు ఎదుట బాధితురాలి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆ వ్యక్తి మహిళను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడని.. దుబాయ్‌కి తీసుకెళ్లి శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా సదరు మహిళ అనుమతి లేకుండా వారి లైంగిక సంభాషణ వీడియోలు రికార్డ్ చేశారని.. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని మహిళను బెదిరించినట్లు కోర్టు ఎదుట తెలిపింది. మరోవైపు నిందితుడికి ఇది వరకే ఓ వివాహం జరగ్గా.. ఆ తర్వాత 2024 జనవరిలో పంజాబ్‌లో మరో మహిళను వివాహం చేసుకున్నట్లు బాధితురాలికి తెలిసింది. 

Also Read: https://teluguprabha.net/telangana/nizamabad-news/nizamabad-corporation-won-by-congress-and-mim/

అయితే పెళ్లికి ముందే దుబాయ్‌కి వెళ్లాలని ఎందుకు భావించారని జస్టిస్ నాగరత్న ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నించారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అంతకుముందు ఇలాంటి శారీరర సంబంధాల నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. ఈ సంఘటన ఇరువురి అంగీకారంతోనే జరిగిందని.. ఏకాభిప్రాయ సంబంధం ఉన్నప్పుడు ఇవి విచారించాల్సిన, దోషులుగా నిర్ధారించాల్సిన కేసులు కావని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీరిద్దరినీ మధ్యవర్తిత్వానికి పంపుతామని పేర్కొంది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News