Homeనేషనల్Supreme Court: ఎన్నికల నిర్వహణపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court: ఎన్నికల నిర్వహణపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court notices to EC and Central: ఎన్నికల నిర్వహణపై కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలింగ్ స్టేషన్లలో బయోమెట్రిక్స్ నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైన నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/aicc-to-hold-all-party-meeting-on-womens-reservation-on-april-15th/

ఎన్నికల నిర్వహణలో బయోమెట్రిక్ విధానాన్ని(వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్) ప్రవేశపెట్టడం ద్వారా దొంగ ఓట్లు, అక్రమాలను అరికట్టాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టు సోమవారం స్పందించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ధ్రువీకరణ కోసం బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను అమలు చేయాలని, తద్వారా డూప్లికేట్ ఓట్లు, రిగ్గింగ్‌ను అరికట్టవచ్చని అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించేందుకు సుముఖుత చూపించింది. అయితే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న లేదా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also Read: https://teluguprabha.net/cinema-news/kerala-hc-stays-on-viral-kumbh-mela-girl-monalisa-husband-arrest-in-abduction-case/

రాబోయే పార్లమెంటు ఎన్నికలు లేదా ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ విధానాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని, దీనిపై తమ వివరణ ఇవ్వాలని కేంద్రం, ఈసీ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు బయోమెట్రిక్స్‌ను ఉపయోగించడంపై అధికారుల నుంచి వివరణ కోరింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News