Homeనేషనల్Supreme court : సరోగసీ ముసుగులో పసిమొగ్గల విక్రయం? కేంద్రానికి సుప్రీం నోటీసులు

Supreme court : సరోగసీ ముసుగులో పసిమొగ్గల విక్రయం? కేంద్రానికి సుప్రీం నోటీసులు

Child trafficking in IVF and surrogacy centers : సంతానం లేని దంపతులకు ‘వరప్రదాయిని’గా మారిన ఐవీఎఫ్ (IVF), సరోగసీ (Surrogacy) కేంద్రాలు.. ఇప్పుడు చీకటి వ్యాపారానికి అడ్డాగా మారుతున్నాయా? ప్రాణం పోయాల్సిన చోటే పసిమొగ్గలను అమ్మకానికి పెడుతున్నారా? ఈ భయంకరమైన వాస్తవాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పిల్లల అక్రమ రవాణా (Child Trafficking) మృగాల్లా మారుతున్న ముఠాల వెనుక ఈ కేంద్రాల హస్తం ఉందన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

- Advertisement -

కేంద్రానికి నోటీసులు: గతంలో వెలువరించిన ‘పింకీ కేసు’ తీర్పు అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న తరుణంలో సుప్రీం కోర్టుకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) మరియు సరోగసీ కేంద్రాలు నియంత్రణ లేకుండా సాగుతున్నాయని, వీటి ద్వారా బాలల అక్రమ రవాణా జరుగుతోందని కోర్టు గుర్తించింది. “ఈ కేంద్రాలలో జరుగుతున్న దందాను అరికట్టేందుకు నిర్దిష్టమైన ప్రామాణిక నిర్వహణ విధానం (SOP) లేకపోవడం శోచనీయం” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, తదుపరి చర్యలకు ఆదేశించింది.

ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెలుగుచూసిన చేదు నిజాలు: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2024 నివేదిక గణాంకాలు దేశంలో బాలల రక్షణ ఏ స్థితిలో ఉందో అద్దం పడుతున్నాయి:
ట్రాఫికింగ్ కేసులు: దేశవ్యాప్తంగా 6,000కు పైగా పిల్లల అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి.
పెరుగుతున్న అదృశ్యాలు: తమ కుటుంబాలను కోల్పోయి, వీధిన పడుతున్న చిన్నారుల సంఖ్య గతంతో పోలిస్తే 7.8 శాతం పెరిగింది.

గాలిలో దీపాలు: దేశవ్యాప్తంగా ఇప్పటికీ 1.47 లక్షల మందికి పైగా పిల్లల జాడ తెలియడం లేదు. వీరంతా అక్రమ రవాణా ముఠాల చేతికి చిక్కారా లేక బలవంతపు చాకిరీలో మగ్గుతున్నారా అన్నది అగమ్యగోచరంగా మారింది.

నియంత్రణ కరువు – వ్యవస్థలో లోపాలు: ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్న లొసుగులను అక్రమార్కులు సానుకూలంగా మార్చుకుంటున్నారు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఈ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
ఒక శిశువు పుట్టినప్పటి నుంచి చట్టబద్ధమైన దత్తత లేదా తల్లిదండ్రులకు అప్పగించే వరకు పర్యవేక్షించే ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (SOP) లేకపోవడమే ఈ దందాలకు ప్రధాన కారణమని న్యాయస్థానం అభిప్రాయపడింది.

సుప్రీం కోర్టు సూచనలు – కీలక మార్గదర్శకాలు: ఈ అమానవీయ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలంటే కేవలం చట్టాలు సరిపోవని, కఠినమైన మార్గదర్శకాలు అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాల పనితీరును పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రతి కేంద్రంలో పుట్టే బిడ్డ వివరాలు, ఆ బిడ్డ ఎవరికి అప్పగించబడింది అనే సమాచారం కేంద్ర డేటాబేస్‌లో నిక్షిప్తమై ఉండాలని నిపుణులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News