Waqf Amendment Act: వక్ఫ్(సవరణ) చట్టం 2025లో పలు కీలక ప్రొవిజన్లను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం మొత్తంపై స్టే విధించడానికి ధర్మాసనం నిరాకరిస్తూ.. కొన్ని కీలక ప్రొవిజన్లను మాత్రమే నిలిపివేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాం మతాన్ని ఆచరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్‌గా చేయడానికి అవకాశం ఉంటుందన్న నిబంధన (సెక్షన్ 3)ని సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది. ఒక వ్యక్తి ఐదేళ్ల పాటు ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసేవరకూ ఈ నిబంధన అమల్లో ఉండదని స్పష్టం చేసింది. సెక్షన్ 3తో పాటు 9, 14, 23, 36, 107, 108 సెక్షన్లను నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అదేవిధంగా కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/aarogyasri-treatment-services-to-be-closed-from-midnight/
వక్ఫ్, వక్ఫ్ వాటాదారుల హక్కులను జిల్లా కలెక్టర్ వంటి ప్రభుత్వ అధికారులు నిర్ణయించడానికి అనుమతించడం అధికార విభజన సిద్ధాంతానికి విరుద్ధంగా ఉందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజారిటీలో ఉండాలన్న ధర్మాసం.. బోర్డులో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండొచ్చని పేర్కొంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఇస్లాం మతానికి వ్యక్తే ఉండటం మంచిదని సూచించింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/ktr-on-jubilee-hills-by-election-campaign/
కాగా, కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్(సవరణ) చట్టం 2025.. ముస్లింల ఆస్తిని పూర్తిగా లాగేసుకునేందుకే అని ఆరోపిస్తూ.. ఈ సవరణ చట్టాన్ని నిలిపివేయాలని దాదాపు 100 కు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. అయితే వక్ఫ్ భూములు పబ్లిక్, ప్రైవేట్ ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకే ఈ నూతన చట్టం అని కేంద్రం వాదించింది.


