Sunday, November 16, 2025
Homeనేషనల్India First: సుప్రీంకోర్టులో సర్పంచ్ ఓట్ల లెక్కింపు.. మూడేళ్ల న్యాయపోరాటానికి విజయతిలకం!

India First: సుప్రీంకోర్టులో సర్పంచ్ ఓట్ల లెక్కింపు.. మూడేళ్ల న్యాయపోరాటానికి విజయతిలకం!

Supreme Court vote recount: ఓటమి పాలయ్యాడని అధికారులు ప్రకటించారు… కానీ అతను ఓటమిని అంగీకరించలేదు. తన గెలుపుపై అచంచల విశ్వాసంతో మూడేళ్ల పాటు న్యాయస్థానాల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. చివరికి దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టానికి తెరలేపాడు. అత్యున్నత న్యాయస్థానం ప్రాంగణంలోనే పంచాయతీ ఎన్నికల ఈవీఎంలను తెరిపించి, తన విజయాన్ని సగర్వంగా ప్రకటించుకున్నాడు! ఒక సామాన్య సర్పంచ్ అభ్యర్థి పట్టుదల ముందు వ్యవస్థలు ఎలా తలవంచాయి..? అసలు ఆ ఓట్ల లెక్కింపులో ఏం జరిగింది? మూడేళ్ల తర్వాత న్యాయం ఎలా గెలిచింది..? ఆ ఉత్కంఠభరిత కథనం మీకోసం…

- Advertisement -

హరియాణాలోని పానిపట్ జిల్లా, బువానా లఖు గ్రామంలో 2022 నవంబర్ 2న సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మోహిత్ మాలిక్ అనే అభ్యర్థి గెలుస్తారని అందరూ భావించారు. అయితే, ఓట్ల లెక్కింపు తర్వాత అధికారులు మరొక అభ్యర్థి కుల్దీప్‌ను విజేతగా ప్రకటించారు. బూత్ నంబర్ 69లో లెక్కింపు ప్రక్రియలో అధికారులు ఫలితాన్ని తారుమారు చేశారని మోహిత్ బలంగా ఆరోపించారు. అక్కడికక్కడే అధికారులతో వాదించినా ఫలితం శూన్యం.

సుప్రీంకోర్టులో చారిత్రక విచారణ : స్థానిక అధికారుల వద్ద, జిల్లా కోర్టులో న్యాయం జరగకపోవడంతో, మోహిత్ మాలిక్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం, దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదమైన ఈవీఎంలను కోర్టుకే తెప్పించి, న్యాయమూర్తుల సమక్షంలోనే ఓట్లను తిరిగి లెక్కించింది. ఈ లెక్కింపులో మోహిత్ మాలిక్, తొలుత గెలిచారని ప్రకటించిన కుల్దీప్‌పై 51 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు స్పష్టమైంది.

ALSO READ: https://teluguprabha.net/national-news/court-deadline-president-assent-centre-warns-constitutional-chaos/

దీంతో సుప్రీంకోర్టు, రెండు రోజుల్లోగా మోహిత్ మాలిక్‌తో సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేయించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆగస్టు 11న కోర్టు తీర్పు రాగా, ఆగస్టు 13న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసి, ఆయనతో ప్రమాణం చేయించింది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం ఫలించి, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున గ్రామ సర్పంచ్‌గా మోహిత్ జాతీయ జెండాను ఎగురవేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు న్యాయం చేసిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈవీఎంలపై మళ్ళీ రాజకీయ దుమారం : ఈ అనూహ్య పరిణామంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందిస్తూ, దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను గుర్తుచేశారు. ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ, “ఓడిపోయిన అభ్యర్థి గెలిచాడు. మూడేళ్ల పాటు ఈవీఎం దయతో ఒక నకిలీ వ్యక్తి సర్పంచ్‌గా ఉన్నాడు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లోనూ ఇలాగే జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం” అని వ్యాఖ్యానించారు. ఈ సంఘటన ఈవీఎంల విశ్వసనీయతపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad