Friday, February 13, 2026
Homeనేషనల్Supreme Court: ఆటిజం చికిత్సకు స్టెమ్‌ సెల్‌ థెరపీ.. సుప్రీంకోర్టు హెచ్చరిక

Supreme Court: ఆటిజం చికిత్సకు స్టెమ్‌ సెల్‌ థెరపీ.. సుప్రీంకోర్టు హెచ్చరిక

Autism Disorder SCT Treatment Supreme Court: ఆటిజం చికిత్స కోసం స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ (SCT) థెరపీని ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆమోదిత, వైద్య పర్యవేక్షణలో మాత్రమే క్లినికల్ రీసెర్చ్ ట్రయల్స్ కోసం SCTని ఆమోదించవచ్చని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/bjp-slams-hamid-ansari-over-mahmud-of-ghazni-comments/

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ASD) చికిత్సకు స్టెమ్ సెల్ థెరపీ(మూలకణ థెరపీ- SCT) వాడకం తగదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆటిజంకి ఈ చికిత్స తగినది కాదని పేర్కొంది. ASD చికిత్సకు SCTకి శాస్త్రీయ మద్దతు లేదని ఉద్ఘాటించింది. అయితే వైద్య పర్యవేక్షణలో మాత్రమే క్లినికల్ రీసెర్చ్ ట్రయల్స్ కోసం SCTని ఆమోదించవచ్చని వెల్లడించింది. కాగా, అనుభవపూర్వక ఆధారాలతో సరైన వైద్య పద్ధతిగా SCT చికిత్స గుర్తింపు పొందలేదని ధర్మాసనం పేర్కొంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద ఒక ఔషధాన్ని సాధారణ చికిత్సగా గుర్తించడం చట్టబద్ధమైనదిగా పరిగణించలేమని అభిప్రాయపడింది. దీనిని వైద్య నిర్లక్ష్యంగా పరిగణించింది. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-assembly-budget-session-2026-dates-notification/

శాస్త్రీయంగా నిరూపణ లేని చికిత్సా పద్ధతులను రోగి తల్లిదండ్రులు ఆశ్రయించకూడదని న్యాయమూర్తులు ధర్మాసనం పేర్కొంది. రోగులు చికిత్సా ప్రయోజనాల ఆశిస్తుంటారని.. ఇందుకోసం ఈ ట్రీట్‌మెంట్‌ని ఉపయోగించడం ఆనైతికమే కాక, వైద్య నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని వెల్లడించింది. ఇప్పటికే రోగులు ఈ చికిత్సను తీసుకుంటుంటే.. వాణిజ్య ప్రయత్నంగా దీనిని కొనసాగించలేమని తెలిపింది. వీరిని క్లినికల్‌ కేంద్రాలకు తరలించేతవరకు ఎయిమ్స్‌ అధికారులతో సంప్రదించి ఉత్తమమైన పరిష్కారాలను చూపాలని చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దీని కోసం నాలుగు వారాల గడువు ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News