Supreme Court: బహిరంగ ప్రదేశాల నుంచి వీధి శునకాల తరలింపునకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వీధి కుక్కలను తరలించాలంటూ 2025 నవంబర్‌లో కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది.
జనంపై దాడులను విస్మరించలేం: సుప్రీంకోర్టు వీధి కుక్కల బెడదపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి శునకాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. ఇటీవల కాలంలో వీధి కుక్కలు సాధారణ ప్రజలపై.. ముఖ్యంగా పిల్లలపై చేసిన దారుణ దాడులను గుర్తుచేసింది.
Also read-Fuel Prices: వాహనదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
ప్రజల భద్రత ముఖ్యం: వీధి కుక్కల వల్ల జరుగుతున్న ప్రమాదాలను తాము ఏమాత్రం విస్మరించలేమని కోర్టు స్పష్టం చేసింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకునే గతంలో ఈ ఆదేశాలు ఇచ్చామని పేర్కొంది. వాటిలో ఎలాంటి మార్పులు చేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ నిర్ణయంతో వీధి కుక్కల నియంత్రణ, తరలింపు ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

