Human Trafficking Supreme Court: దేశవ్యాప్తంగా చిన్నారులు, మహిళళ మిస్సింగ్ కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారుల అక్రమ రవాణా సమస్యను తీవ్రంగా పరిగణించిన కోర్టు.. ఈ మేరకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పిల్లల మిస్సింగ్ కేసులపై కిడ్నాప్ ఎఫ్‌ఐఆర్ తప్పనిసరి అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎవరైనా కనిపించకుండా పోతే వెంటనే కేసు నమోదు చేయాల్సిందేనని.. ప్రాథమిక విచారణ పేరుతో ఆలస్యం చేయొద్దని వెల్లడించింది.
Also Read: https://teluguprabha.net/cinema-news/puri-jagannadh-controversial-comments/
మార్గదర్శకాలు జారీ
దేశంలో సుమారు 47 వేల మంది పిల్లలు ఆచూకీ లేకుండా ఉన్నారని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో మానవ అక్రమ రవాణా ముఠాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి సుప్రీంకోర్టు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం.. చిన్నారుల అక్రమ రవాణాపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
Also Read: https://teluguprabha.net/telangana/telangana-cabinet-allotted-huge-funds-for-godavari-pushkaralu/
ప్రత్యేకంగా పోర్టల్
అదృశ్యమైన మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా పోర్టల్ తీసుకురావాలని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లను ఒకే వేదికపై తెస్తూ జాతీయ స్థాయి గ్రిడ్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. తప్పిపోయిన వ్యక్తి 24 గంటల్లోపు వస్తే కేసు అక్కడే మూసివేయొచ్చని.. కానీ 24 గంటల వరకూ వేచిచూడకుండా ఆచూకీ కోసం వెంటనే అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. మిస్సింగ్ కేసులపై అవగాహన, నిజాయతీ, సామర్థ్యం ఉన్న అధికారులనే నియమించాలని అభిప్రాయపడింది.

