Homeనేషనల్Supreme Court : ఎన్టీఏ మారదా? 'నీట్' పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. కేంద్రం,...

Supreme Court : ఎన్టీఏ మారదా? ‘నీట్’ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. కేంద్రం, సీబీఐలకు నోటీసులు!

Supreme Court hearing NEET UG 2026 paper leak : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల కలల సౌధమైన వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్-యూజీ 2026’ (NEET-UG) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం నిప్పులు చెరిగింది. పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలు మూటగట్టుకుంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన చేదు అనుభవాల నుంచి ఎన్టీఏ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోకపోవడం పట్ల విస్మయం వ్యక్తంచేసింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad-metro-rail-13600-crore-refinancing-irfc-deal-telangana-government-takeover/

పాఠాలు నేర్చుకోలేదు.. ఇది తీవ్ర బాధాకరం: సర్వోన్నత న్యాయస్థానం : ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA), యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ (UDF) సహా పలు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్టీఏ పనితీరుపై కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. “ఇది నిజంగా బాధాకరమైన విషయం. గతంలో జరిగిన ఘటనల నుంచి వారు ఎలాంటి గుణపాఠాలూ నేర్చుకోలేదు. అప్పట్లో కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన మానిటరింగ్ కమిటీ సూచనలు ఏమయ్యాయి?” అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ, సీబీఐ (CBI) లకు నోటీసులు జారీ చేస్తూ, అత్యవసరంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

రాధాకృష్ణన్ కమిటీ నివేదికపై సుప్రీంకోర్టు గురి : గతంలో నీట్ పరీక్షల సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. ఆ కమిటీ సైబర్ భద్రత, పరీక్షల పారదర్శకతపై ఇచ్చిన సిఫారసులు ఎంతవరకు అమలయ్యాయో నివేదించాలని స్పష్టం చేసింది. మానిటరింగ్ కమిటీ ఛైర్మన్‌గా కె. రాధాకృష్ణన్ స్వయంగా దీనిపై నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Also Read: https://teluguprabha.net/top-stories/ktr-says-24-hour-drinking-water-will-be-provided-in-hyderabad-once-brs-comes-to-power/

22 లక్షల మంది భవిష్యత్తు అంధకారం.. పిటిషనర్ల వాదన : “గోరుచుట్టుపై రోకటిపోటు” అన్నట్లుగా ఏటా నీట్ పరీక్షల్లో జరుగుతున్న లోపాలు 22 లక్షల మందికి పైగా ఉన్న వైద్య విద్యార్థుల ప్రాథమిక హక్కులపై నేరుగా దాడి చేస్తున్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. లోపభూయిష్టంగా మారిన ఎన్టీఏను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని లేదా దాని స్థానంలో సరికొత్త స్వతంత్ర సంస్థను తేవాలని కోరారు. ఇకపై జరిగే రీ-ఎగ్జామ్‌ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలతో కూడిన హైపవర్ కమిటీ పర్యవేక్షణలోనే నిర్వహించాలని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తోంది.

ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం కూడా రేగుతోంది. పరీక్షల పారదర్శకతను కాపాడటంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాబోయే గురువారం నాడు ఎన్టీఏ సమర్పించే అఫిడవిట్ ఆధారంగా సుప్రీంకోర్టు ఎలాంటి సంచలన తీర్పునిస్తుందోనని దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News