Tuesday, February 17, 2026
HomeTop StoriesSupreme Court: మా దేశ గోప్యతతో ఆడుకోలేరు- మెటా, వాట్సాప్‌కి సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్‌

Supreme Court: మా దేశ గోప్యతతో ఆడుకోలేరు- మెటా, వాట్సాప్‌కి సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్‌

Supreme Court On Whatsapp And Meta: వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవద్దని వాట్సాప్, మెటాకు సర్వోన్నత న్యాయస్థానం కఠిన హెచ్చరిక జారీ చేసింది. టెక్ దిగ్గజాలు రూపొందించిన గోప్యతా విధానాలు.. చాలా తెలివిగా ఉన్నాయని.. కానీ సాధారణ పౌరులు వాటి వాస్తవ పరిణామాలను గ్రహించలేరని ఆందోళన వ్యక్తం చేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. మంగళవారం ఈ కేసును విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/pm-modi-india-us-trade-deal-nda-meeting-budget-2026-vision/

వాట్సాప్, దాని మాతృ సంస్థ మెటాకు.. డేటా-షేరింగ్, గోప్యతా విధానాలపై సుప్రీంకోర్టు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. వినియోగదారుల డేటాను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని స్పష్టం చేసింది. “మీరు మా దేశ గోప్యతతో ఆడుకోలేరు. మా డేటాలో ఒక్క అంకెను కూడా షేర్‌ చేయడానికి మిమ్మల్ని అనుమతించబోం’. అని వ్యాఖ్యానించింది. వాట్సాప్ తన 2021 గోప్యతా విధానంపై ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’(CCI) విధించిన రూ. 213.14 కోట్ల జరిమానాను సమర్థిస్తూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT) తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మెటా, వాట్సాప్ దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు నేడు విచారించింది. విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. 

దేశం విడిచివెళ్లండి.. 

వాట్సాప్ తన మాతృసంస్థ మెటాతో యూజర్ల డేటాను పంచుకోవడాన్ని “వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఒక నాగరిక మార్గం” అని ధర్మాసనం అభివర్ణించింది. భారతీయ పౌరుల ప్రైవసీ హక్కులతో ఆడుకోవడానికి తాము అనుమతించబోమని.. మా దేశ డేటాలో ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగాన్ని, ఇక్కడి చట్టాలను గౌరవించలేకపోతే దేశం విడిచి వెళ్లిపోవచ్చని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో హెచ్చరించింది.

Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-municipal-elections-2026-b-form-rates-money-politics-updates/

ఈ మేరకు వాణిజ్య ప్రకటనల కోసం యూజర్ల డేటాను మెటాతో పంచుకోబోమని స్పష్టమైన హామీ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని మెటా యాజమాన్యానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ పూర్తి అయ్యే వరకు మెటాతో ఎటువంటి యూజర్ సమాచారాన్ని పంచుకోవద్దని వాట్సాప్‌కు కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై ఫిబ్రవరి 9 లేదా 10 న వివరణాత్మక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News