Thursday, March 6, 2025
Homeనేషనల్Supreme Court: రిలేషన్‌షిప్‌-అత్యాచార కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

Supreme Court: రిలేషన్‌షిప్‌-అత్యాచార కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

సుప్రీం కోర్టు (Supreme Court) కీలక తీర్పులో, దీర్ఘకాలిక సహజీవనం తర్వాత వివాహ హామీతో మోసం చేశారనే అత్యాచార ఆరోపణలను కొట్టివేసింది.పెళ్లి చేసుకుంటాననే హామీతోనే శారీరక సంబంధం ఏర్పడిందని నిరూపించడం కష్టమని పేర్కొంది. 16 ఏళ్ల సహజీవనం తర్వాత అత్యాచారం ఆరోపణ చేసిన మహిళా లెక్చరర్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

సుదీర్ఘ కాలం పాటు ఓ వ్యక్తితో సహజీవనం(Relation) చేసి ఆ తర్వాత తనను పెళ్లి పేరుతో మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ మహిళలు పెట్టే అత్యాచారం కేసులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

- Advertisement -

ఇరువురి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని కచ్చితంగా నిర్ధారించలేం
అలాంటి సందర్భాలలో పెళ్లి చేసుకుంటాననే హామీతో మాత్రమే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని కచ్చితంగా నిర్ధారించలేమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. లివ్-ఇన్ పార్టనర్(Leave in Partner) అత్యాచారం చేశాడని ఆరోపించిన బ్యాంకు అధికారిపై క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహం చేసుకుంటానని చెప్పడంతోనే అతనితో 16 సంవత్సరాలుగా శారీరక సంబంధం పెట్టుకున్నానని ఆరోపించిన మహిళా లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.

పెళ్లి పేరుతో మోసం చేశాడని అనుకోలేం
ఇద్దరు వ్యక్తులు వెల్ ఎడ్యూకేట్ అయి, ఇష్టపూర్వకంగా ఏకాభిప్రాయ సంబంధాన్ని కొనసాగించారని, వేర్వేరు పట్టణాల్లో నివసిస్తున్నప్పటికీ తరచుగా ఒకరి ఇళ్లను ఒకరు సందర్శించేవారని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసు లవ్‌ ఫెయిల్యూర్‌ లేదా లివింగ్-ఇన్ బ్రేకప్‌గా కోర్టు పరిగణించింది. 16 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు సన్నిహిత సంబంధం కొనసాగినందున, వారి మధ్య16 సంవత్సరాల పాటు లైంగిక సంబంధాలు నిరంతరాయంగా కొనసాగాయని తెలిపింది. వారి బంధంలో నిందితుడు ఎప్పుడూ బలవంతం లేదా పెళ్లి పేరుతో మోసం చేశాడని అనుకోలేమని చెప్పింది.

లైంగికంగా వాడుకున్నాడని కచ్చితంగా చెప్పలేం
దాదాపు 16 ఏళ్లుగా వాళ్లు కలిసే ఉన్నారని చెప్పిన కోర్టు ఇన్నేళ్ల పాటు అతను కేవలం పెళ్లి చేసుకుంటాననే మాట చెబుతూ ఆమెను లైంగికంగా వాడుకున్నాడని కచ్చితంగా చెప్పలేమని తెేల్చేసింది. ఇద్దరి పరస్పద అంగీకారంతోనే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

పెళ్లి పేరుతో మోసం చేశాడని భావించినప్పటికీ, కేవలం పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే ఇన్నేళ్లు ఆమె, అతనితో శారీరక సంబంధం పెట్టుకుందని భావించడం సరికాదని కోర్టు పేర్కొంది. బంధం ఎక్కువ కాలం కొనసాగినప్పుడు అటువంటి వాదనలు విశ్వసనీయతను కోల్పోతాయని కోర్టు వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News