Saturday, June 7, 2025
Homeనేషనల్Surat court: రాహుల్ కు రెండేళ్ల జైలు

Surat court: రాహుల్ కు రెండేళ్ల జైలు

ప్రధాని మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన సంచలన కామెంట్స్ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను సూరత్ కోర్టు విధించింది. పరువు నష్టం కేసులో రాహుల్ కు ఈ శిక్ష పడింది.  కాగా వెంటనే రాహుల్ కు బెయిల్ కూడా లభించటం విశేషం.  మోడీ ఇంటిపేరున్న వారంతా దొంగలే అంటూ 2019 లో రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించగా రాహుల్ కు ఇలా శిక్ష పడింది.

- Advertisement -

ఆర్థిక నేరగాళ్లు, మోసగాళ్లైన, దేశం విడిచి పోయిన నీరవ్ మోడీ, లలిత్ మోడీ వంటి వారి పేర్లను రాహుల్ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తావించి చిక్కుల్లో పడ్డారు. క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు ఆయనకు 30 రోజుల గడువు కూడా అప్పీల్ చేసుకునేంద్కు ఇచ్చింది.  పూర్నేష్ మోడీ ఈ కేసు దాఖలు చేశారు. మోడీ సామాజిక వర్గాన్ని గంపగుత్తగా రాహుల్ బద్నాం చేశారని విచారణలో పూర్నేష్ మోడీ ఆరోపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News