HomeTop StoriesTamilnadu Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌- డీఎంకే సీట్ల సర్దుబాటు

Tamilnadu Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌- డీఎంకే సీట్ల సర్దుబాటు

Tamilnadu Elections Seats allotted: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌- డీఎంకే సీట్ల సర్దుబాటు ఖరారైంది. ఈ మేరకు సీఎం స్టాలిన్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. డీఎంకే మిత్రపక్షాలకు 70 సీట్లు కేటాయించగా.. మిగిలిన 164 స్థానాల్లో అధికార పార్టీ పోటీ చేయనుంది. డీఎంకే తరఫున మాజీ సీఎం పన్నీరు సెల్వం పోటీ చేయనున్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/dy-cm-pawan-kalyan-about-amaravati-capital-in-assembly/

తమిళనాడులో ఏప్రిల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్(SPA) కూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయింది. ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్‌ పార్టీకి 28 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. మొత్తం 234 స్థానాల్లో 164 నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేస్తుండగా.. మిత్ర పక్షాలు 70 సీట్లలో నిలబజనుంది. 

డీఎండీకే పార్టీ 10 స్థానాలు, వీసీకే 8 స్థానాలు, సీపీఐ, సీపీఎం వామపక్షాలు ఒక్కో పార్టీకి 5 నియోజకవర్గాల చొప్పున కేటాయించింది. ఎండీఎంకే 4 స్థానాలు, ఇతర చిన్న పార్టీలు ఐయూఎంఎల్, ఎంఎంకే వంటి ఇతర మిత్రపక్షాలు కూడా డీఎంకే తరఫున పోటీలో నిలబడుతున్నాయి. 

Also Read: https://teluguprabha.net/cinema-news/rishab-shetty-unfollowed-rukmini-vasanth-after-hombale-film-maker/

సీఎం ఎంకే స్టాలిన్, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై మధ్య ఈ ఒప్పందం కుదిరింది. సీట్ల పంపకాలతో పాటు కాంగ్రెస్‌కు ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా డీఎంకే కేటాయించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎండీకే, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు తమ సొంత గుర్తులపై పోటీ చేస్తుండగా.. మిగిలిన కొన్ని చిన్న పార్టీలు డీఎంకే ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుపై పోటీ చేయనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News