Tamilnadu Elections TVK Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే(తమిళగ వెట్రి కళగం) సంచలనం విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో అనూహ్యమైన ఆధిక్యాన్ని సాధిస్తూ రికార్డు సృష్టిస్తోంది. పార్టీ విజయపథంలో దూసుకుపోతున్న తరుణంలో, నటి త్రిష కృష్ణన్ నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా ఫలితాల ప్రకారం, మొత్తం 234 స్థానాల్లో టీవీకే 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ రోజు త్రిష పుట్టిన రోజు కాగా.. సోమవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా చెన్నైలోని విజయ్ ఇంటికి వెళ్లారు. మరోవైపు టీవీకే పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ, విజిల్స్ వేస్తూ పండుగలా వేడుకలు జరుపుకొంటున్నారు.
VIDEO | Tamil Nadu Election Results: Actor Trisha reaches TVK chief Vijay’s residence in Chennai.
Vijay-led TVK appeared to be inching towards the majority mark of 118 in the 234-seat Tamil Nadu Assembly.#TamilNaduPollResults2026 #Results2026WithPTI… pic.twitter.com/Ogg7CccgUf
— Press Trust of India (@PTI_News) May 4, 2026
ఇక.. విజయ్ తండ్రి చంద్రశేఖర్‌తో పాటు కుటుంబ సభ్యులందరూ సోఫాలో కూర్చుని ‘విజిల్’ వేస్తూ, విక్టరీ గుర్తు చూపిస్తూ గెలుపు ఆనందాన్ని ప్రజలతో పంచుకుంటున్నారు. డ్యాన్సులు వేస్తూ సెలబ్రేషన్స్ జరుపుకొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను యాక్టర్ విజయ్ టీమ్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
Whistle celebrations by Thalapathy family 🙏🏼🙏🏼 #ElectionResult2026 pic.twitter.com/mO6ywlRLBS
— Actor Vijay Team (@ActorVijayTeam) May 4, 2026

