Saturday, November 15, 2025
Homeనేషనల్MK Stalin: తమిళనాడులో నూతన విద్యా విధానం అమలు

MK Stalin: తమిళనాడులో నూతన విద్యా విధానం అమలు

Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర విద్యా విధానాన్ని విడుదల చేసింది. ఈ విధానంలో త్రిభాషా సూత్రాన్ని పక్కనపెడుతూ ద్విభాషా విధానానికి మొగ్గు చూపారు. అలాగే సైన్స్, ఏఐ, ఆంగ్ల భాషకు ప్రాముఖ్యతను ఇచ్చారు. అన్నా సెంటెనరీ లైబ్రరీ ఆడిటోరియంలో తమిళనాడు రాష్ట్ర విద్యా విధానాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆవిష్కరించారు.

- Advertisement -

తమిళనాడు రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించడానికి 2022లో కమిటీని ఏర్పాటు చేసారు. రిటైర్డ్ జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో తమిళనాడు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నూతన విద్యా విధానానికి సంబంధించిన నివేదికను గతేడాది జూలైలో ముఖ్యమంత్రి స్టాలిన్ కి సమర్పించారు.

Read more: https://teluguprabha.net/national-news/rajnath-singh-america-trip-cancelled/

ఈ నివేదికలో విద్యను విద్యను ఉమ్మడి జాబితా నుండి రాష్ట్ర జాబితాకు బదిలీ చేయాలని మురుగేశన్ కమిటీ  సిఫారసు చేసింది. మురుగేషన్ కమిటీ 3,5,8 తరగతులకు సంబంధించి పబ్లిక్ పరీక్షల ప్రతిపాదనను వ్యతిరేకించింది. పై తరగతులకు పబ్లిక్ పరీక్షల నిర్వహణ కారణంగా డ్రాపౌట్ రేట్లు పెరుగుతాయని అభిప్రాయపడింది. నూతన విద్యా విధానంలో 11,12 తరగతుల మార్కుల ఆధారంగా యూజీ ప్రవేశాలు ఉంటాయని వెల్లడించింది.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. విద్యార్థులు బట్టీపట్టి చదవడానికి బదులుగా, సృజనాత్మకతతో ఆలోచించడం ఉత్తమమని, అదే ఈ నూతన విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. ఈ విధానంలో తమిళ భాషకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది వరకు 100 శాతం ఉన్నత విద్యను అభ్యసించేలా చర్యలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.

Read more: https://teluguprabha.net/national-news/pm-modi-tribute-ms-swaminathan-bharat-ratna/

తమిళనాడు విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేష్ మాట్లాడుతూ.. 10వ తరగతి వరకు అన్ని బోర్డులలో విద్యార్థులు తమిళం చదువుతారన్నారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలో కూడా జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబోమని తెలిపారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad