Thursday, March 12, 2026
Homeనేషనల్Trisha: 'పొరపాటుగా ఆ వ్యాఖ్యలు చేశా.. క్షమించండి'- త్రిషపై కామెంట్స్‌కి స్పందించిన బీజేపీ నేత

Trisha: ‘పొరపాటుగా ఆ వ్యాఖ్యలు చేశా.. క్షమించండి’- త్రిషపై కామెంట్స్‌కి స్పందించిన బీజేపీ నేత

BJP chief sorry to Trisha: తమిళనాడు టీవీకే పార్టీ అధినేత విజయ్‌, సినీ నటి త్రిషలపై బీజేపీ నేత నైనార్‌ నాగేంద్రన్‌ ఆదివారం పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై త్రిష తీవ్రంగా స్పందించడంతో.. నైనార్‌ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/it-was-a-minor-shoulder-keyhole-surgery-chiranjeevi-shares-a-post/

సినీ నటి త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్‌ నాగంద్రన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన విచారం వ్యక్తం చేస్తూ త్రిషకు క్షమాపణలు చెప్పారు. పొరపాటుగా ఆ వ్యాఖ్యలు చేశానని.. తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల బహిరంగ సభలో బీజేపీపై టీవీకే అధినేత విజయ్ తీవ్రంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. విమర్శలపై స్పందించిన నాగేంద్రన్.. విజయ్‌కి రాజకీయ అనుభవం లేదని వ్యాఖ్యానించారు. మొదట త్రిషతో బంధం విడిపించుకుని కుటుంబంతో మమేకం కావాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ దుమారం రేపగా.. త్రిష ఘాటుగా స్పందించారు.  

Also Read: https://teluguprabha.net/gallery/bill-gates-visited-andhra-pradesh-photos/

రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తాను అనుకోలేదని త్రిష సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేని విషయాల్లోకి తనను లాగవద్దని మండిపడ్డారు. త్రిష స్పందించిన కొద్దిసేపటికే నైనార్ నాగేంద్రన్ తన వ్యాఖ్యల పట్ల విచారం చేస్తూ ప్రకటన చేశారు. పొరపాటుగా ఆ వ్యాఖ్యలు చేశానని.. బీజేపీ అఖిల భారత మహిళా విభాగం నాయకురాలు వానతి శ్రీనివాసన్, బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తనతో ఈ వ్యాఖ్యల గురించి చర్చించారని అన్నారు. తన వ్యాఖ్యల పట్ల బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని వెల్లడించారు. ఎవరి మనసును బాధపెట్టే ఉద్దేశం తనకు లేదన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News