Homeనేషనల్Supreme Court: రెండు వారాల్లో లొంగిపోవాలి

Supreme Court: రెండు వారాల్లో లొంగిపోవాలి

*తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

- Advertisement -

ఢిల్లీ,  (తెలుగుప్రభ): తెహల్కా మ్యాగజీన్‌ వ్యవస్థాపకుడు, ఆ పత్రిక మాజీ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సహోద్యోగినిపై అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు తనకు విధించిన 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష నుంచి లొంగుబాటుకు సడలింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. రాబోయే రెండు వారాల వ్యవధిలో పోలీసుల ఎదుట లొంగిపోవాలని జస్టిస్ ఆలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అదే సమయంలో తనను దోషిగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు విధించిన 10 ఏళ్ల శిక్షను సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్‌పై సెప్టెంబర్‌ 22న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. అయితే లొంగిపోయినట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్‌ సమర్పించిన తర్వాతే అప్పీల్‌పై విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.

కేసు నేపథ్యం ఇదీ
2013లో గోవాలో ‘తెహల్కా’ మ్యాగజైన్‌ నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా హోటల్‌ లిఫ్ట్‌లో తన జూనియర్‌ సహోద్యోగిపై అత్యాచారం చేసినట్లు తరుణ్‌ తేజ్‌పాల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు తొలుత తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆ తీర్పును బాంబే హైకోర్టు ఈ నెల 6న తోసిపుచ్చింది. అత్యాచారం కేసులో తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారిస్తూ 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ తేజ్‌పాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పీల్‌ విచారణ పెండింగ్‌లో ఉన్నందున అప్పటివరకు లొంగిపోవడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Also Read: Supreme Court: సీబీఎస్‌ఈ రీ-వాల్యుయేషన్ విండో తెరిచేందుకు సుప్రీం నిరాకరణ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News