Hyderabad: ఈ మధ్యకాలంలో విమాన ప్రమాద ఘటనలు ప్రపంచం నలుమూలలో తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత ఈ ప్రమాదాల సంఖ్య విపరీతంగా వినిపిస్తుంది. విమానాలలో సాంకేతిక సమస్యలు తలెత్తి అత్యవసర ల్యాండింగ్ అవడం ఈ ఏడాది ఎక్కువగా జరుగుతుంది.
తాజాగా తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపాన్ని పైలట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గుర్తించారు. దీంతో పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి, సుమారు 45 నిమిషాల పాటు విమానం గాలిలోనే చక్కర్లు కొట్టించారు. ఆ తర్వాత తిరిగి తిరుపతి ఎయిర్ పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సాంకేతిక సమస్యతో విమానం గాల్లో తిరుగుతున్న సమయంలో అందులోని ప్రయాణికులు అంతా భయాందోళనకు గురయ్యారు.
Readmore: https://teluguprabha.net/national-news/couple-three-children-found-dead-at-home-in-ahmedabad/
ఇక్కడ మరొక సమస్య ఏంటంటే అత్యవసర ల్యాండింగ్ అయ్యాక ప్రయాణికుల కోసం ఇండిగోె ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో ప్రయాణికులు తిరుపతి ఎయిర్ పోర్టులో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పైలట్ల చాకచక్యంతో క్షేమంగా ల్యాండ్ అయినప్పటికీ ప్రత్యామ్నాయంగా మరో విమానం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గమ్యస్థానానికి వెళ్లే ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు.
అహ్మదాబాద్ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగటంతో పైలట్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, చిన్న సమస్య వచ్చినా విమనాశ్రయంలోనే నిలిపివేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెపుతున్నారు. థాయిలాండ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన విమానాన్ని హైదరాబాద్‌లోనే ల్యాండ్ చేశారు. అలాగే చెన్నై నుండి హైదరాబాద్ రావాల్సిన విమానంలో కూడా ఇటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చెన్నైలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Readmore: https://teluguprabha.net/national-news/shashi-tharoor-said-i-have-some-differences-with-congress/
ఓవైపు పైలట్లు అప్రమత్తంగా ఉండి సాంకేతిక సమస్యలను గుర్తిస్తున్నారు. దీని ద్వారా ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. ఈ విషయంలో కాస్త సంతోషించదగినదే అయినా.. ఈ తరహా సంఘటనలు మాత్రం ప్రయాణికులలో ఆందోళనను పెంచుతున్నాయి.


