Telegram petition filed in High Court against the ban: టెలిగ్రామ్ ద్వారా నిందితులు నీట్ పేపర్ లీకేజీకి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ యాప్‌పై కేంద్రం తాత్కాలిక బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఈనెల 21న జరగనున్న నీట్ ఎగ్జామ్ నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. అయితే, ఈ చర్యలను టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ వ్యతిరేకించారు. పేపర్ లీక్ సమస్యను పరిష్కరించకుండా.. నిందితులపై చర్యలు తీసుకోకుండా.. తమ యాప్‌ను నిషేధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనివల్ల కోట్లాది మంది వినియోగదారులు ప్రభావితమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. టెలిగ్రామ్‌ను నిషేధించినంత మాత్రాన లీకులు ఆగవని.. నిందితులు ఇతర యాప్‌ల నుంచి కూడా అక్రమాలకు పాల్పడతారని పేర్కొన్నారు. మరోవైపు, ఈ నిషేధాన్ని టెలిగ్రామ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో, ఈ విషయంపై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది.
Also read: Bandla Ganesh: పవన్ వీరాభిమానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన బండ్ల గణేష్!
రెండ్రోజుల పాటు బ్యాన్ అమల్లో..
కాగా, నీట్ రీటెస్ట్ జూన్ 21న నిర్వహిస్తుండగా.. జూన్ 22 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రశ్నపత్రాల లీకేజీ, తప్పుడు వార్తల వ్యాప్తిని నివారించేందుకు, పేపర్ లీకేజీని అరికట్టేందుకు ఈ తాత్కాలిక చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపింది. టెలిగ్రామ్‌లోని మెసేజ్-ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా నిలిపివేయాలని ఆ యాప్‌ను ఆదేశించింది. పరీక్షలు జరిగిన తర్వాత, టైమ్ స్టాంప్‌ను అలాగే ఉంచుతూ, మెసేజ్‌లను ఎడిట్ చేయడం, ప్రశ్నలను ఎడిట్ చేయడం ద్వారా పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితులు దొరక్కుండా తప్పించుకుంటున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అభిప్రాయపడింది. అందువల్ల, ఈ యాప్‌ను దుర్వినియోగం చేస్తూ పేపర్ లీకేజీ చేస్తున్నారని ఎన్‌టీఏ ఆరోపించింది.

