Saturday, November 15, 2025
Homeనేషనల్Nepal Bus Attack: నేపాల్‌లో భారతీయ టూరిస్టు బస్సుపై దాడి.. నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

Nepal Bus Attack: నేపాల్‌లో భారతీయ టూరిస్టు బస్సుపై దాడి.. నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

Telugu People Stuck in Nepal after Going on Vacation: నేపాల్‌లో గత కొన్ని రోజులుగా ఆందోళనలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా బ్యాన్‌ జెన్‌జెడ్‌ చేపట్టిన ఈ నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయ దర్శనానికి వెళ్లిన భారతీయులపై శుక్రవారం దాడి జరిగింది. వారు ప్రయాణిస్తున్న బస్సుపై దుండగులు దాడి చేశారు. బస్సులోని ప్రయాణికులను బెదిరించి నగదు, నగలు, సెల్ ఫోన్లు సహా విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. కాసేపటికి నేపాల్ ఆర్మీ వచ్చి తమను కాపాడిందని, భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో స్వస్థలాలకు చేరుకున్నామని భక్తులు తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈ టూరిస్టు బస్సుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్ డ్రైవర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ దోపిడీ ఘటనను రాజ్ మీడియాకు వివరిస్తూ.. పశుపతినాథ్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఒక దొంగల ముఠా బస్సును అడ్డగించి, బస్సు అద్దాలను ధ్వంసం చేసి ప్రయాణికులను బెదిరించిందని తెలిపారు. తమ వద్ద ఉన్న నగదు, నగలు, విలువైన వస్తువులతో పాటు బ్యాగులను కూడా ఎత్తుకెళ్లారని ఆయన వివరించారు. కాగా, దొంగలు పలువురు ప్రయాణికులపై దాడికి పాల్పడ్డారని బాధితులు మీడియా ఎదుట వాపోయారు. ఆ తర్వాత కాసేపటికి నేపాల్ సైనికులు వచ్చి తమకు సహాయం చేశారని, భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో తాము సురక్షితంగా సరిహద్దులు దాటామని వివరించారు.

- Advertisement -

నారా లోకేష్‌ చొరవతో ఏపీకి 40 మంది..

మరోవైపు, నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారిని రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీ మంత్రి నారో లోకేష్‌ చొరవతో 40 మంది తెలుగు యాత్రకులు సురక్షితంగా ఆంధ్రప్రదేశ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నేపాల్‌లో మేం ఉంటున్న హోటల్‌కి నిప్పుపెట్టారు. మా లగేజ్‌ అంతా హోటల్‌లోనే ఉంది. కట్టుబట్టలతో తప్పించుకున్నాం. మళ్లీ విశాఖ వస్తామని అనుకోలేదు. ఏపీ ప్రభుత్వం చొరవతో బయటపడ్డాం.. దారిలో మేం ప్రయాణిస్తున్న బస్సుపై కూడా దాడి జరిగింది. కర్రలు, రాడ్లతో బస్సును ధ్వంసం చేశారు. అక్కడి క్యాబ్‌ డ్రైవర్లు మాకు సహకరించారు. మూడు రోజులు హోటల్‌లోనే ఉండిపోయాం. మా హోటల్‌లోకి ఆందోళనకారులు చొరబడ్డారు. దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లారు. తాము తిరిగి విశాఖ చేరుకోవడానికి కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని నేపాల్‌ నుంచి తిరిగివచ్చిన యాత్రికులు తమకు ఎదురైన ఛేదు అనుభవాన్ని పంచుకున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad