దేశ రాజధాని న్యూ ఢిల్లీలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కాగా ఈరోజు అత్యల్పంగా 1.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీ నగర వాసులు చలితో గజగజ వణికిపోతున్నారు. కాగా మరో మూడు రోజులపాటు ఇలాగే ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు ఢిల్లీలో 1 డిగ్రీ ఉష్ణోగ్రత ఉండనున్నట్టు ఐఎండీ హెచ్చరించింది. హర్యానాలోని హిస్సార్ లో ఏకంగా 0.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావటం విశేషం. అమృత్ సర్ లో 1.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
- Advertisement -
పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ లోనూ ఇలాగే ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. మంచు దుప్పట్లో కూరుకుపోయిన ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎండలు కూడా గరిష్ఠంగా ఉంటాయని ఐఎండీ చెబుతోంది.