Homeనేషనల్ED Raids on Vijayan: విజయన్‌ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. అధికారుల కార్లపై కార్యకర్తల...

ED Raids on Vijayan: విజయన్‌ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. అధికారుల కార్లపై కార్యకర్తల దాడి..!

Tension at Vijayan’s house: కేరళలో ప్రభుత్వం మారిన వెంటనే మాజీ సీఎం పినరయికి తలనొప్పులు మొదలయ్యాయి. విజయన్‌ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల కొలువుదీరిన యూడీఎఫ్‌ ప్రభుత్వం ఈ కేసు విచారణ వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా ఇవాళ విజయన్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. వీటిని తీవ్రంగా వ్యతిరేకించిన పినరయి మద్దతుదారులు.. ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. అంతేకాదు, ఈడీ అధికారులపై దాడికి పాల్పడ్డారు. వారి కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు, కేంద్ర బలగాలు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

- Advertisement -

Also read: Bandi Bhagirath: బిగ్‌ ట్విస్ట్.. అరణ్య ఫాంహౌస్‌కి బండి భగీరథ్‌.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న పోలీసులు

దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు..

దాడి సమయంలో వాహనంలో మహిళా అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఆందోళనకారులను సీపీఎం కార్యకర్తలుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనను ఈడీ తీవ్రంగా పరిగణించింది. ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువనంతపురంలోని థంపనూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News