Delhi Red Fort blast 200 IED bombs : దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడు దేశాన్ని కలచివేసింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా, 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో దర్యాప్తు మొదలైన కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబై దాడుల తరహాలో దిల్లీలో వరుస పేలుళ్లకు జైష్-ఎ-మహ్మద్ (JeM) ఉగ్రవాద ముఠా కుట్ర పన్నినట్లు NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) తేల్చింది. ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌లు టార్గెట్‌లిస్ట్‌లో ఉన్నాయి. ఈ కుట్రకు 200 IED (ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) బాంబులు సిద్ధం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచిస్తున్నాయి.
ALSO READ: Mali TikTok Execution : టిక్‌టాక్ ఇన్‌ఫ్లుయెన్సర్ బహిరంగ ఉరి… ఎక్కడంటే..?
NIA 10 మంది బృందంతో దర్యాప్తు చేస్తోంది. జమ్మూ-కాశ్మీర్, హర్యానా, UP పోలీసుల నుంచి డైరీలు తీసుకుని ఫైనాన్స్, ఆపరేషన్‌లు చెక్ చేస్తున్నారు. బుధవారం IB చీఫ్‌తో NIA DG భేటీ అయ్యింది ఇటీవల J&Kలో 2,900 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ పేలుడు నుంచి 40 నమూనాలు సేకరించారు. అమ్మోనియం నైట్రేట్, ఇతర శక్తివంతమైన మెటీరియల్ బయటపడింది. JeM పాక్ ఆధారంగా పని చేస్తోందని అనుమానం వ్యక్తమవుతుంది. టార్గెట్‌లిస్ట్‌లో దిల్లీ ఐకానిక్ ప్లేసెస్, రైల్వే స్టేషన్లు, మాల్స్ ఉన్నాయి. జనవరి నుంచి కుట్రలు పన్నినట్లు తెలుస్తోంది. ఇక పేలుళ్ల నేపథ్యంలో దిల్లీ పోలీస్, NIA దర్యాప్తు ముమ్మరం చేశాయి. భద్రతా చర్యలు పెంచారు.


