అందరి సహకారంతోనే మహా కుంభమేళా(Kumbhmela) దిగ్విజయంగా విజయవంతం అయిందని ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో ప్రసంగించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రపంచం మెుత్తం మన భారతదేశ శక్తిని చూసిందని కొనియాడారు.
పటాపంచలు
కుంభమేళాను విజయవంతం చేసిన ప్రజలందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మన సామర్ధ్యంతోపై ఉన్న అనుమానాలను ఈ ఆధ్మాత్మిక కుంభమేళా పటాపంచలు చేసిందన్నారు. ఈ విజయం మన అందరిక కృషి అన్నారు.
భిన్నత్వంలో ఏకత్వమే
భిన్నత్వంలో ఏకత్వానికి ఆలవాలమైన భారత సంస్కృతి కుంభమేళాలో ఆవిష్కృతమైందని ప్రధాని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న యుద్ధాల కారణంగా దేశాల మధ్య ఎడం పెరుగుతున్న నేపథ్యంలో భారత దేశం భిన్నత్వంలో ఏకత్వమే తన ప్రత్యేకత అని కుంభమేళాతో గొప్పగా చాటుకుందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ హర్షం
మహా కుంభమేళాలో యువతరం పెద్ద ఎత్తున పాల్గొనడంపై కూడా ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయాలను ఆధ్యాత్మికతను యువత సగర్వంగా అందిపుచ్చుకున్నదని వ్యాఖ్యానించారు.
Modi: కుంభమేళాను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES